Telugu News

ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రిపువ్వాడ..

ఖమ్మం-విజయంన్యూస్

0

ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రిపువ్వాడ..

(ఖమ్మం-విజయంన్యూస్);-

మ‌త‌సామ‌రస్యానికి కాపాడ‌టంతోపాటు.. ముస్లీం సంక్షేమానికి కృషి చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వమే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని హదిసే/ఎలాన్ మజీద్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రిపువ్వాడ హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సియం కేసిఆర్  ప్ర‌భుత్వ హాయాంలో రాష్ట్రంలో మ‌తాల మ‌ద్య ఘ‌ర్ష‌ణ‌లు లేకుండా స్నేహా పూర్వ‌కంగా క‌లిసి మెలిసి ఉండే సంస్కృతిని పెంపొందించారని అన్నారు.ప‌విత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని ప్రతి మజీద్ అభివృద్ధి కొరకు ఒక్కో మజీద్ కు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అందులో భాగంగా రూ.50 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు

also read :-నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్‌ గారు ముస్లింల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారుఅన్ని మ‌తాల పండుగ‌ల‌ను ప్ర‌భుత్వం గుర్తించి చేదోడు వాదోడుగా నిలిచింద‌న్నారు. పేద ముస్లీంల కుటుంబాలకు దుస్తులు పంపిణి, మైనార్జీ పిల్లల కోసం గురుకులాల‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని అన్నారు.

దేశంలోనే ముస్లీంలకు ప్రాధాన్య‌త క‌ల్పించిన ఘ‌నత సియం కేసిఆర్ ప్ర‌భుత్వానిదేనని అన్నారు.ముస్లీం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు రంజాన్ ప‌విత్ర మాసోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు తాజుద్దీన్, మస్జీద్ సదర్ సలీం, 53 డివిజన్ మైనారిటీ అధ్యక్షుడు ఎండీ ఇమామ్ పాషా, టౌన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు శంషుద్దీన్, అబ్బాస్, మస్జీద్ కమిటీ సభ్యులు, సమ్మి, యాసిన్, రహీమ్, రజాక్, నయీమ్ తదితరులు పాల్గొన్నారు