బీజేపీ పార్టీలోకి భారీగా చేరికలు
(విజయం న్యూస్ ములుగు జిల్లా, కన్నాయిగూడెం):-
మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో బీజేపీ మండల అద్యక్షులు కావిరి సంతోష్, అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా జాడి రామరాజు నేత బీజేపీ ములుగు జిల్లా ప్రచారకార్యదర్శి హాజరైనారు, సమావేశంలో రామరాజు నేత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేశారు.
also read :-మిల్లుల్లో ఎఫ్ సీఐ, సివిల్ సప్లై అధికారుల అకస్మిక తనిఖీలు
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కేవలం కేంద్రం ఇచ్చే బడ్జెట్ తో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కార్యకర్తలకు వివరించారు. భారతీయ జనతా పార్టీ లో పనిచేసే ప్రతీ ఒక్క కార్యకర్త సైనికునిలాగ పనిచేయాలని చుసించారు. ఈ కార్యక్రమం అనంతరం లక్ష్మీపురం గ్రామంలోని యువత మరియు కాంగ్రెస్, తెరాసా కార్యకర్తలు బొమ్మరాజు రవీందర్, కిసాన్ మోర్చ్ జిల్లా నాయకులు అధ్వర్యంలో భారీగా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.
also read :-ఖమ్మం కెమిస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం..
పార్టీలో చేరిన వారు రెడ్డి సుమన్, రామానుజం సాయి, షేక్ ముస్తప్ప, అంబర్కని నగేష్, ఎర్రోళ్ల రమాకాంత్, చందు, సాయికిరణ్, అగ్గు వెంకటేష్, నగేష్, బోట శ్రీకాంత్, బన్నీ, ప్రవీణ్, మహేందర్, మహేష్, పండు, గౌష్, జంగా కృష్ణలతో సహా దాదాపు 49 మంది పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి సత్యం, మండల నాయకులు కావీరీ సమ్మయ్య, డబ్బగట్ల నాగరాజు, పోడెం సమ్మయ్య, ఇర్ప మల్లికార్జున్, దబ్బగట్లా పవన్, డబ్బాగట్లా నరేష్, కోరం దీపక్, జాడి హరీష్, భౌత్ రామకృష్ణ, కుమ్మరి పగిడి, జనగాం లక్ష్మీపతి, జనగాం దుర్గారావు, కుమ్మరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.