Telugu News

మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం పట్ల పొంగులేటి హర్షం

విజయం న్యూస్

0

మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం పట్ల పొంగులేటి హర్షం

(ఖమ్మం విజయం న్యూస్):-

ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ, గిరిజన విద్యార్థులతో పాటు ఎన్నో తెగలకు చెందిన విద్యార్థులు వైద్యవిద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లలేక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఉన్న ఈ ప్రధాన డిమాండ్ ను సీఎం కేసీఆర్ తీర్చడం పట్ల తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన ఆనతి కాలంలోనే ఈ నిర్ణయం ప్రకటించడం గొప్ప విషయమన్నారు.

also read :-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క@మీడియా పాయింట్

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై పొంగులేటి సంతృప్తి వ్యక్తం చేస్తు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. తొలుత ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా అందులో మన ఖమ్మంజిల్లా కూడా ఉండటం గర్వించదగిన విషయమన్నారు. కొన్ని వేల మంది ఉమ్మడి జిల్లాకు చెందిన వైద్య విద్య చదవాలని కోరుకునే విద్యార్థులకు భవిష్యత్తులో ఇది ఎంతోగానో ఉపయుక్త పడుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువయ్యేలా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

also read :-ప్రజారంజక బడ్జెట్ : నామా

అదేవిధంగా బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేస్తు రూ. 50లోపు రుణాలను ఈ ఏడాది మార్చిలోగా మాఫీ చేస్తామని చెప్పడం, సాగురుణాలు రూ. 75వేలను మాపీ చేస్తామని ప్రకటించడం అలాగే వచ్చే ఏడాది లోగా రూ. 16, 144 కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పడం తెలంగాణ ప్రభుత్వనికే సాధ్యమైందన్నారు. పల్లె ప్రగతికి, పట్టణ ప్రగతికి కూడా ఈ బడ్జెట్ లో సంపూర్ణ న్యాయం జరిగిందన్నారు. దళితబంధుకు 17,700 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా మిగిలిన వర్గాలకు న్యాయం జరిగేలా ఎస్టీల సంక్షేమానికి రూ. 12,565 కోట్లు, బీసీల సంక్షేమానికి 5,698 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టించి అందరివాడు అనే చెరగని ముద్రను ప్రతిఒక్కరి మదిలో వేయించుకున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.