Telugu News

ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ : సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు

విజయం న్యూస్

0

ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ : సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు

(విజయం న్యూస్):-

ఖమ్మం జిల్లాకు నూతన వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి బడ్జెట్ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ని అసెంబ్లీ లో మర్యాదపూర్వంగా కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవతో ఖమ్మం జిల్లా కు మెడికల్ కాలేజీ మంజూరు కావడం పట్ల మంత్రి అజయ్ హర్షం వ్యక్తం చేశారు.

also read;-ఉక్రెయిన్ అధ్యక్షుడితో 35 నిమిషాల పాటు మాట్లాడిన ప్ర‌ధాని మోదీ

సీఎం కేసిఆర్ నేతృత్వంలో వైద్యసేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ, దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని మంత్రి అజయ్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, ఉపేంద్ర రెడ్డి, రాములు నాయక్ పాల్గొన్నారు.