Telugu News

మంత్రి ఎర్రబెల్లి హోలీ కోలాటం

గిరిజనులతో కూడి నృత్యాలు. కోలాటం

0

మంత్రి ఎర్రబెల్లి హోలీ కోలాటం

** గిరిజనులతో కూడి నృత్యాలు. కోలాటం

(జనగాం-విజయం న్యూస్);-

జనంతో ఇట్లే కలిసిపోయి, వాళ్ళతో పాటు ఆటా, పాట, జీవితాల్లో ఒకడిగా నిలిచే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తను మాస్ కు మాస్ లీడర్ నని నిరూపించారు. తనకు ఎదురైన గిరిజన మహిళలతో వారి కోరిక మేరకు కోలాటం ఆడి ఆనంద పరిచారు.

also read;-ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడితో పాఠాశాలల అభివృద్ధి తథ్యం: మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో కడవెండి-పొట్టిగుట్ట శివారులోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తూ0డగా.. మార్గం మధ్యలో లంబాడా గిరిజన మహిళలు హోలీ ఆడుతూ కనిపించారు. వారిని చూసిన మంత్రి తన వాహనాన్ని ఆపి, వారిని పలకరించారు. మంత్రి తో కలిసిపోయిన లంబాడ గిరిజన మహిళలు ఆయనకు బొట్లు పెడుతూ తమతోపాటు హోలీ అలాగే కోలాటం ఆడాల్సింది గా విజ్ఞప్తి చేశారు. వారి కోరికను మన్నించిన మంత్రి వారితో కొద్దిసేపు చప్పట్లు కొడుతూ, మరి కొద్దిసేపు కోలాటం ఆడి, అక్కడున్న వాళ్ళందరిని ఆనందపరిచారు.