Telugu News

నూతన ఖమ్మం మున్సిపల్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం

0

నూతన ఖమ్మం మున్సిపల్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
== పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ. 22 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయా భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం జరిగిందని త్వరలోనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గారిచే ప్రారంభోత్సవానికి ఏర్పట్లను సిద్ధం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి నూతన నగరపాలక సంస్థ భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. లిఫ్ట్, రిసెప్షన్ కౌంటర్, ఇంజనీరింగ్, మీ సేవ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ప్రహరీ, పార్కింగ్, గ్రీనరీ, టైల్స్, త్రాగునీటి వసతి, వెయిటింగ్ హాల్, పౌరుల వసతులు తదితర పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

also read;-ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’ ఇస్తాం : మంత్రి పువ్వాడ

గ్రేటర్ హైద్రాబాద్ తరహాలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయ భవనం నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖమ్మం నగరాభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులకు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు నగర మేయర్ పునుకొల్లు నీరజ,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు , సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్మ్ సురభి, మున్సిపల్ ఎస్.ఇ ఆంజనేయప్రసాద్, ఇ.ఇ కృష్ణలాల్, డి.ఇ రంగారావు, మున్సిపల్ అధికారులు సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు సాల్గొన్నారు.