Telugu News

ఖమ్మంలో 16న మంత్రి కేటిఆర్ పర్యటన

పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

0

ఖమ్మంలో 16న మంత్రి కేటిఆర్ పర్యటన

—పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

 

(ఖమ్మం బ్యూరో :విజయంన్యూస్);-

రాష్ట్ర పురపాలక, ఐ టీ శాఖ ల మంత్రి కేటిఆర్ ఖమ్మం పర్యటన ఖరారు అయ్యింది. ఆ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు.ఖమ్మం నగరంలో పలు అభవృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, పువ్వాడ ప్రారంభోత్సవాలు చేసి అనంతరం సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 16 న ఉదయం 9.00 హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 10.00గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

also read;-ఈ ప్రభుత్వం శ్రీవారి దర్శనం నుండి భక్తులను దూరం చేస్తుంది….!!
10.15 గంటలకు రఘునాథపాలెం పల్లె బృహత్ ప్రకృతి వనం (Suda) పార్క్ ప్రారంభిస్తారు. 10.45 గంటలకు ఖమ్మం టేకులపల్లి KCR Towers నందు డబుల్ బెడ్ రూం (240) ఇళ్లను ప్రారంభిస్తారు.11.15Am గంటలకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన foot path ను ప్రారంభిస్తారు.11.45Am; GATTAIAH CENTER లో నూతన మున్సిపల్ భవనం ప్రారంభోత్సవం చేస్తారు.
చెత్త సేకరణ నిమిత్తం మున్సిపల్ కార్యాలయంకు మంజూరైన ట్రాక్టర్లు (10), ఆటోలు (15) ను ప్రారంభిస్తారు.

also read;-తొలి ప్రసంగంలోనే కశ్మీర్ పై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహ్ బాజ్
మధ్యాహ్నం 1.00 లకు లంచ్ బ్రేక్ అనంతరం 2.30 గంటలకు DANAVAIGUDEM లోని Faecal sludge treatment plant ను ప్రారంభిస్తారు. 3.00 గంటలకు PRAKASH NAGARలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామంను ప్రారంభిస్తారు. 3.30 కి SRINIVAS NAGAR- Sweage Treatment plant (STP) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

4.00PM – LAKARAM TANK BUND వద్ద Suspension Bridge ను ప్రారంభిస్తారు. Musical Fountain & Led లైటింగ్ ను ప్రారంభిస్తారు.
Amphitheatre కు శంకుస్ధాపన చేస్తారు. సాయంత్రం 5.00 గంటలకు Lakaram Tank Bund వద్ధ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 6.00 గంటలకు హైదరాబాద్ కు తిరిగి వెళతారు.