Telugu News

ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

విజయం న్యూస్

0

ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

(ఖమ్మం విజయం న్యూస్):-

మ‌త‌సామ‌రస్యానికి కాపాడ‌టంతో పాటు.. ముస్లీంల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు.పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఖమ్మం నగరంలోని త్రీటౌన్ కాల్వఒడ్డు లోని మోతే మజీద్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి పువ్వాడ హాజ‌ర‌య్యారు.ఉపవాసంలో ఉన్న దీక్షకులను పండ్లు తినిపించి ఈరోజు ఉపవాసంను విరమింపజేశారు.

also read :-పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే’ అని ప‌రీక్ష‌లో రాసిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి..

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ.. మత సామరస్యం అనేది తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఆనాడు మహాత్మ గాంధీ చెప్పిన మాటలను మంత్రి పువ్వాడ గుర్తు చేశారు.రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమం పై చిత్తశుద్దితో ఉన్నామని, ప్రతి పేదవాడు ఉన్నత విద్యను అభ్యసించారు తలంచిన ప్రభుత్వం ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో TRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజ్, సుడా చైర్మన్ విజయ, కార్పొరేటర్ కమర్తపు మురళి, జిల్లా మైనారిటీ అధ్యక్షులు తాజుద్దీన్, ముతవళి సర్వర్ మియా, సెక్రెటరీ సయ్యద్ మహబూబ్ పాష, ఇమామ్ సాబ్, అబ్దుల్ గని, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ జానీ, షేక్ అంజద్, షేక్ ఇస్మాయిల్, ఎండి అన్వర్ ఖాన్, షంషుద్దీన్, తాజుద్దీన్, ఆసిఫ్, భాషా, షేక్ హుస్సేన్, మజీద్, మొహమ్మద్ షమీ తదితరులు ఉన్నారు.