Telugu News

మంత్రి పువ్వాడ క్షేమం..

ఆందోళన చెందొద్దు అని ప్రకటన.

0

మంత్రి పువ్వాడ క్షేమం..

– ఆందోళన చెందొద్దు అని ప్రకటన.

– రెండు రోజుపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు..

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సోమవారం జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగల దాడి చేసిన విషయం విదితమే. ఆలయ పశ్చిమ గోపురం(సప్తతల గోపురం)పై పూజా క్రతువులో ఉన్న మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ వసంత లక్ష్మి , వేద పండితులపై ఒక్కసారిగా తేనెటీగల దాడి చేశాయి. తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భక్తిభావంతో మహాకుంభ సంప్రోక్షణ పూజా పూర్తి చేశారు.

also read;- యాసంగి ధాన్యం కేంద్ర సర్కార్ కొనాల్సిందే

అనంతరం ప్రాథమిక చికిత్స కై హైదరాబాద్ కు బయల్దేరివెళ్లారు. విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తీవ్ర అందోళనకు గురయ్యారు. ఫోన్ ద్వారా మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేశారు. తమ నాయకుడికి ఏమి కావొద్దని, పూర్తి ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి మా మధ్యకి రావాలని పలు ఆలయాల్లో పూజలు చేపట్టారు.

also read;-ఏప్రిల్ 4 నుంచి ఖమ్మం జిల్లాలో షర్మిళ పాదయాత్ర

ఈ సందర్భంగా దాడి పై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తాను క్షేమంగా ఉన్నానని మంత్రిపువ్వాడ ట్విట్టర్ ద్వారా పేర్కోన్నారు.వైద్యుల సూచనల మేరకు రెండు రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పారని వివరించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నెమ్మదించారు. త్వరగా తమ మధ్యకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.