Telugu News

బ్రహ్మణులంటే సీఎం కేసీఆర్ కు ఎంతో గౌరవం : మంత్రి పువ్వాడ

బ్రహ్మణులకు పరిషత్ మంజూరు చేసి, రూ.100 కోట్ల నిధులు కేటాయించింది కేసీఆర్

0

బ్రహ్మణులంటే సీఎం కేసీఆర్ కు ఎంతో గౌరవం

— బ్రహ్మణులకు పరిషత్ మంజూరు చేసి, రూ.100 కోట్ల నిధులు కేటాయించింది కేసీఆర్

— బ్రహ్మణుల సమస్యలను పరిష్కరిస్తాం

— బ్రహ్మణ సేవా సంఘం సమాఖ్య కార్యవర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న మంత్రి

(ఖమ్మం -విజయంన్యూస్)

బ్రహ్మణులంటే సీఎం కేసీఆర్ కు ఎంతో గౌరవమని,  బ్రహ్మణులకు పరిషత్ కు భవనం మంజూరు చేసి, రూ.100 కోట్ల నిధులు కేటాయించింది కేసీఆర్ అని రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం తెలంగాణా రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య కార్యవర్గ ప్రమాణస్వీకారం సమావేశం ఖమ్మం లోని ఎంబీ గార్డెన్ లో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్  బ్రాహ్మణులకు ఉన్నత గౌరవం కల్పించారని అన్నారు. మీకు పరిషత్ ఏర్పాటు చేసి 100 కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్  ఏ పని చేసిన మీకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొని గౌరవిస్తారని అన్నారు. మీ ఆశీర్వాదాలు ఈ ప్రభుత్వానికి అవసరమని, మీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ శర్మ మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో బ్రాహ్మణ భవన్ ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని ఫైనాన్స్ దగ్గర ఆగిందని మంత్రికి విన్నవించారు. మీరు కల్పించుకుని ఆయా అనుమతులు ఇప్పించి ఖమ్మం జిల్లాలో బ్రాహ్మణ భవన్ శంకుస్థాపనకు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వాలని, కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయిన బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.ప్రతీ జిల్లాలో సంఘం యొక్క సభ్యత్వం విస్తరించి ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఎన్నుకొనే విధంగా చర్యలు తీసుకుంటాం అని అన్నారు.

రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గా సరస్వతి భట్ల సీతారామయ్య (శ్రీధర్ శర్మ), కార్యదర్శులుగా రామారావు ధేశ్ పాండే, మహిళా విభాగం అధ్యక్షురాలు దేవులపల్లి వాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వైద్యం ప్రభాకర్ శర్మ, రీజినల్ సెక్రటరీగా తాటికొండాల సీతారామ శాస్త్రి, ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గంకు మంత్రి పువ్వాడ అభినందనలు తెలియజేశారు..

also read : ఐలమ్మపై మంత్రి పువ్వాడ అసక్తికర కామెంట్స్

ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ చూడాలనుకుంటున్నారా.. బ్రెకింగ్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే👆 ఒపెన్ చేయండి మీకు కనిపించే 🛎️ గంటను నొక్కండి.. ఎప్పటికప్పుడు ‘మా న్యూస్ మీ ముంగిట..’