Telugu News

***సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. పండుగ రోజు

***మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్

0

***సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. పండుగ రోజు

***మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్

***జిల్లా తెరాస శ్రేణులకు మంత్రి అభినందనలు

(ఖమ్మం విజయం న్యూస్):-

ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజుని పురస్కరించుకొని మూడ్రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో సీఎం జన్మదిన వేడుకలు జరుపుకున్న పార్టీ శ్రేణులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

also read :-వరుస చోరీల నిందితుడు అరెస్ట్

పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ ఎల్లపుడూ అండగా ఉంటుందని మంత్రి అజయ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు అందరికీ పండుగరోజు అని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకొన్న సందర్భంగా వారికి మంత్రి అభినందనలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కేక్‌లు కట్‌ చేసి మరికొన్ని చోట్ల మొక్కలు నాటారని అనాథలు, వృద్ధులకు అన్న, వస్త్రదానాలు చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.