Telugu News

కేంద్రానికి మరోసారి తెలంగాణ దెబ్బ రుచి చూపిద్దాం

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

0

కేంద్రానికి మరోసారి తెలంగాణ దెబ్బ రుచి చూపిద్దాం

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

(నిజమాబాద్ అర్బన్ – విజయం న్యూస్);-

టీఆర్ఎస్ పార్టీ తలపెట్టే పోరాటంలో రైతులు తమతో కలిసి రావాలని కోరుతూ రేపటి నుండి 11వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపి కేంద్రానికి మరోసారి తెలంగాణ దెబ్బ రుచి చూపిద్దామని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారంనిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.తెలంగాణ వడ్లు కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

also read :-గల్లీ లో పీకలేనోడివి ఢిల్లీలో పీకుతావా

బిజెపి ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒకమాట మాట్లాడుతున్నదని విమర్శించారు. ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలి అది వారి బాధ్యత అన్నారు. దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగబద్ధంగా ఉందని, ఎన్నో దశాబ్దాలుగా ఇదే తరహా నడుస్తున్నదని చెప్పారు.
కానీ ఈ రెండేళ్ళ నుండి తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ కక్ష పెట్టుకొని పేచీలు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో యాసంగిలో వడ్లు పట్టిస్తే నూకలు ఎక్కువ వస్తాయని, దిగుబడి తగ్గుతదన్నారు. అందుకే ఇక్కడ బాయిల్ చేస్తామని, గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నారని ప్రశ్నించారు.

also read :- ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఎం విన్నూతన నిరసన
ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందం పీయూష్ గోయెల్ ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినే అలవాటు చేయండి అనటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.. చాలా హీనంగా, ఘోరంగా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి నేతలు ఇలా చేస్తారనే ముందు జాగ్రత్తతో కేసీఆర్ ముందస్తుగానే వరి సాగు తగ్గించాలని సూచించారన్నారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని, వారి వేసేలా రైతులను ఉసిగొల్పారన్నారు. వరి వేస్తే ప్రతి గింజ కొనే బాధ్యత బిజేపిది అని బండి సంజయ్ ప్రకటించారన్నారు.కిషన్ రెడ్డి సైతం పలు మార్లు వరి వేయమని, కొంటామని పదే పదె ప్రకటించారని, అది బాయిల్ అయినా రా రైస్ అయినా రా కొంటామన్నారని, ఇపుడు మాటమార్చడం సిగ్గుచేటన్నారు.

also read :-శుభకృత్ లో అంత శుభమే జరుగుతుంది..
ఇక నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు సూటి ప్రశ్న అంటూ రా రైస్ కానీ బాయిల్ రైస్ కానీ కొనిపిస్తమని బిజేపి నేతలు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా??. అని పేర్కొన్నారు. అరవింద్ తెలివి హీనంగా మాట్లాడుతున్నాడని, తను ఇచ్చిన దొంగ హామీ లు కప్పి పుచ్చుకోవడానికే ఇదంతా డ్రామాఅని, ఎంపి అరవింద్ ను రైతులు తరమి కొడతారని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రం వడ్లు తీసుకోము అనటమే సమస్య. అందుకే తెలంగాణ రైతుల పక్షాన తమ పోరాటం అని మంత్రి అన్నారు.