తెలంగాణలోనే రోడ్లకు మహర్దశ*
***అద్దంలా మెరుస్తున్న రోడ్లు
***అన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లు
* **సిఎం కెసిఆర్ చొరవతో జరుగుతున్న అభివృద్ధి
*** రూ.6 కోట్ల 35లక్షల విలువైన 3 రోడ్లకు శంకుస్థాపన చేసిన
** *రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్
(మహబూబాబాద్- విజయం న్యూస్)
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే రోడ్లకు మహర్దశ వచ్చిందని, ఇప్పుడు ప్రతి పల్లెపల్లెకు రోడ్లు రావడమే కాదు. ప్రతి గ్రామంలోనూ అంతర్గత రోడ్లు కూడా వచ్చాయని, అవన్నీ అద్దంలా మెరుస్తున్నాయని, ఈ దశ కేవలం సీఎం కెసిఆర్ వల్ల మాత్రమే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నెల్లికుదురు మండలం సీతారాం పురం వద్ద మంత్రి మూడు రోడ్లకు శంకుస్థాపన చేశారు.
also read;-మల్టీస్టార్ అంటే వెంకటేష్
సీతారాం పురం నుంచి ఇనుగుర్తి వరకు వయా రేకుల తండా వరకు రూ. 3 కోట్లతో వేయనున్న 5 కి.మీ. బీటీ రోడ్డు, సీతారాం పురం నుంచి రాజుల కొత్తపల్లి వరకు రూ. కోటి 55 లక్షలతో వేయనున్న 2న్నర కి.మీ. బీ.టీ రోడ్డుకు, సీతారాంపురం నుంచి చిన్న నాగారం వరకు రూ. కోటి 80 లక్షలతో వేయనున్న 3 కి.మీ. బీటీ రోడ్డుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక లతో కలిసి శంకుస్థాపన చేశారు.
also read;-వరంగల్‌లో రెండు రోజుల పాటు ఘనంగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ0
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, గతంలో రోడ్లు గతుకుల మయంగా ఉండేవన్నారు. మట్టి కొట్టుకుపోయి, కంకర తేలి, నడవడానికి కూడా వీలు కాకుండా రోడ్లుండేవన్నారు. గ్రామాలకు లింకు రోడ్లు కూడా ఉండేవి కావు. ఇక గ్రామాల్లో అంతర్గత రోడ్ల పరిస్థితి అయోమయంగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయని చెప్పారు. ఇదంతా తెలంగాణ తెచ్చిన సీఎం కెసిఆర్ , చొరవ తీసుకుని చేస్తున్న అభివృద్ధిగా మంత్రి పేర్కొన్నారు. ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయలు ఇవ్వాల మంజూరవుతున్నాయని, అన్ని రకాల పథకాలు కలుపుకుంటే, ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయలు వస్తున్నాయని మంత్రి వివరించారు. ఇంత అభివృద్ధి గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. 40 ఏండ్ల తన రాజకీయ జీవితంలోనూ ఇలాంటి సిఎంని, అభివృద్ధిని చూడలేదని మంత్రి చెప్పారు.
also read;- దమ్మపేట మండలం మల్లారం గ్రామ శివారులో
ఒకవైపు ఇంతగా అభివృద్ధి జరుగుతుంటే, కొందరికి కండ్లకు ఇదంతా కనిపించడం లేదని పరోక్షంగా ప్రతిపక్షాలను తీవ్రంగా దుయ్యబట్టారు. ఇక్కడి రైతాంగం కోసం సీఎం కెసిఆర్ ప్రాజెక్టులు కట్టి, సాగు, మంచినీరు ఇచ్చి, 24 గంటల కోతలు లేని కరెంటు ఇచ్చి, పంటల పెట్టుబడులు ఇచ్చి, రైతులకు బీమా చేసి, రుణాలు మాఫీ చేసి, పంటలు కూడా తానే కొనుగోలు చేసే దాకా ఆదుకుంటుంటే… కేంద్రం మాత్రం రైతులపై నల్ల చట్టాలు తెచ్చి కార్పొరేట్లకు మద్దతుగా రైతులను రాచి రంపాన పెడుతున్నదన్నారు.
also read;-వరంగల్‌లో రెండు రోజుల పాటు ఘనంగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ0
మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదని, దీన్ని మన సీఎం కెసిఆర్ తన పొందిలో ప్రాణం ఉన్నంత వరకు జరగనీయనని మొండికేశారన్నారు. ఈ కారణంగానే కేంద్రం మన రాష్ట్రంపై కక్ష కట్టిందని, కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని, అడుగడుగునా అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. చివరకు బియ్యం, రైతుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని అన్నారు. పంజాబ్ లో కొనుగోలు చేస్తున్నట్లే మన రాష్ట్రంలోనూ కొనుగోలు చేయమని అడగడం తప్పా? అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు.
also read :-మంత్రి పువ్వాడ క్షేమం..
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల రోడ్లు, మురుగునీటి కాలువలు ఇచ్చామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మరిన్ని రోడ్లు వస్తాయని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.