Telugu News

పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కందాళ.

పలు కుటుంబాలకు అర్థిక చేయూత.

0

పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కందాళ.
పలు కుటుంబాలకు అర్థిక చేయూత.
నవదంపతులను ఆశీర్వదించిన కందాళ.

(కూసుమంచి-విజయం న్యూస్) :- 

పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శనివారం పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా కూసుమంచి మండలంలోని కోక్యతండా, లోక్యతండా, నేలపట్ల నుంచి చదువుకునే విద్యార్థులకు, ప్రజలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో వారికి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించారు. కాగా ఆబస్సును ప్రారంభించారు. బస్సులో ప్రయాణించారు. అనంతరం 1000 మంది విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ లను అందించారు. అనంతరం నేలకొండపల్లి మండలంలోని స్నేహటీవీ రిపోర్టర్ గంజికుంట్ల వెంకన్న కుమారుడి వివాహానికి హాజరై నవదంపతులు కిషోర్-శృతిలను ఆశీర్వదించారు.

బోదుల బండ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న గండారపు లక్ష్మయ్యను పరామర్శించిన కందాళ ఉపేందర్ రెడ్డి వారికి అర్థిక సహాయం అందజేశారు. అలాగే ఏటూకూరి అమృతమ్మ ఇటీవలే మృతి చెందగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. రాజేశ్వరపురంలో దండసత్యనారాయణ-నాగజ్యోతి కుమార్తే రేవతిని ఆశీర్వదించారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన అద్దంకి ఉపేంద్రచారి-సుజాత దంపతుల కుమార్తే భవాని-శివకుమార్ వివాహ వేడుకకు హాజరై వారిని ఆశీర్వదించారు. మునిగేపల్లి గ్రామంలో నర్శింశెట్టి నాగేశ్వరరావు-సుగుణ కుమారుడు ఎస్పీఎఫ్ కానిస్టెబుల్ నరేస్ ను ఆశీర్వదించారు.

ఖమ్మం రూరల్ మండలం తల్లంపు గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ గుడిబోయిన దర్గయ్య తండ్రి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కూసుమంచి మండల కేంద్రంలోని సీనియర్ నాయకులు వీరవెల్లి నాగేశ్వరరావు తమ్ముడి కుమారుడు కార్తీక్ ను ఆశీర్వదించారు. తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు గ్రామంలో గుండా రఘురాంరెడ్డి ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై బాధపడుతుండగా ఆయన ఇంటివద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం నూతన నవదంపతులు పవన్ కుమార్-సాహితి, బత్తిని అఖిలాండేశ్వరి-ప్రభంజన్ లను ఆశీర్వదించారు. కూసుమంచి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన రామసహాయం వెంకట్ రెడ్డి కుమారుడు వివాహానికి హాజరైన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడిడ సాత్విక్ రెడ్డిని ఆశీర్వదించారు. జుజ్జలరావుపేట గ్రామంలో మృతిచెందిన పడిశాల ప్రసాద్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

వారి కుటుంబానికి రూ.10వేలను అందించారు. అనంతరం తిరుమలాయపాలెంలో పర్యటించిన ఆయన చౌటపల్లి-జూపేడ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాజారం గ్రామనికి చెందిన పేర్ల మమత చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. వారి కుటుంబానికి రూ.10వేలను అందించారు. సోలిపురంలో కోటయ్య-బస్వమ్మ కుమారేత సంద్యను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బానోతు శ్రీనివాస్, బోడా మంగిలాల్, బెల్లం ఉమా, వజ్య రమ్య, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, బెల్లం వేణు తదితరులు పాల్గొన్నారు.

alls0 read :- చనిపోయిన రైతులను ఆదుకోవాలి.