ఎమ్మెల్యే శంకర్ నాయక్ కె కరోనా పాజిటివ్
(మహబూబాబాద్-విజయం న్యూస్)
మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ బుధవారం కరోనా బారిన పడ్డారు. కరోన లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకో గా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనిపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధికారిక ప్రకటన చేశారు. తనకు కరోనా వైరస్ సోకిందని ప్రస్తుత హోంఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు.
ప్రజలు కార్యకర్తలు ఫోన్ లో అందుబాటులో ఉంటానని తన ఫోన్ నెంబర్లు 9989303555,9704543555 లను సంప్రదించాలని కోరారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ప్రజలు కూడ కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.