ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..?
== గొంతు నొక్కుతే పేదలకు న్యాయం జరుగుతుందా..?
== కాంగ్రెస్ నేతల ముందస్తు ఆరెస్టులను ఖండించిన సీతక్క
== అరెస్టులు అప్రజాస్వామికం.. తక్షణమే క్షమాపణ చెప్పాలి
ఖమ్మంప్రతినిధి, జూలై 30(విజయం న్యూస్ )
ప్రజలకు న్యాయం చేయండి అని అడిగాలని అనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం ప్రజాస్వామికం కాదని, ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా..? గొంతు నొక్కితే పేదలకు న్యాయం జరుగుతుందా..? అని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం వరద బాధితులను ఆదుకునేందుకు పార్థసారది రెడ్డి సుమారు కోటి రూపాయల వ్యయంతో 13 వేల మందికి నిత్యవసర సరుకులు పంచడానికి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు “చలో నాగినేని ప్రోలు రెడ్డిపాలెం”కు పిలుపునిచ్చారు. దీంతో ఎంపీల పర్యటనకంటే ముందుగానే పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
allso read- కాళ్ళేశ్వరం ప్రాజెక్టు ను సీఎల్పీ ఆధ్వర్యంలో పరిశీలిస్తాం: భట్టి
ఈ సందర్భంగా ఆమె భద్రాద్రికోత్తగూడెం పోలీస్ అధికారులతో పోన్లో మాట్లాడి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పినట్టు బియ్యం కోసం పప్పు,ఉప్పు కోసం కాదు మనం తెలంగాణ కొట్లాడి సాధించుకుంది. కాళేశ్వరం కింద పోలవరం ఎఫెక్ట్ నీ అంచనా వేయలేని అసమర్థ నాయకులు ప్రచారం మీద తప్ప వరద బాధితుల పై ప్రేమలేని ఈ నాయకులను నమ్ముకుంటే శాశ్వతంగా గోదావరిలో మునగడం తప్ప మనకు వేరే గతిలేదని, మొన్నటి గోదారి ముంపు వలన ఇల్లు- గృహసర వస్తువులే కాకుండా గేదెలు, పంట పొలాలు చిన్నపాటి దుకాణాలు కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారని, అది అడిగినందుకు అరెస్టులు చేయడమేంటని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రజలను కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంటే ప్రజలకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని, సురక్షితమైన గృహ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా తక్షణ సహాయంగా కుటుంబానికి ఒక లక్ష రూపాయలు,పంట నష్టం,జీవనోపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం ధృడమైన కరకట్ట, వంటి వాటిని త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
== నాయకులను పరామర్శించిన సీతక్క
ఈ అరెస్ట్ లను ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు.గోదారి వరద బాధితుల పక్షాన తమ గోడును తెలియపరిచేందుకు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..? అని ములుగు సీతక్క ప్రశ్నించారు. శనివారం బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ముందస్తుగా అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గోదావరి వరద బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచిన నాయకులను ముందస్తుగా అక్రమ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని , రాష్ట్ర ప్రభుత్వం వరద ముప్పు బాధ్యతలకు పరిహార ప్రకటించి 15 రోజులు అవుతున్న పరిహారం అందని పరిస్థితి నెలకొంది అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాకుండా ఇప్పుడు యాత్రలకు వచ్చినట్లు వచ్చారని ఆమె ఆరోపించారు. ప్రజలు ప్రశ్నిస్తారని సమాధానం చెప్పకుండా అక్రమ అరెస్టులు చేయడానన్ని తీవ్రంగా ఖండించారు. వరద బాధితులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పార్టీవరద బాధితుల పక్షాన పోరాడుతుందన్నారు.
allso read- తెలంగాణలో టీడీపీ బలం చూపిస్తాం: చంద్రబాబు
== పాల్వంచ సిఐతో ఫోన్లో మాట్లాడిన సీతక్క
పాల్వంచ సీఐ తో సెల్ ఫోన్లో మాట్లాడారు. ప్రశ్నించే వాళ్లను అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ కు తరలించడం మంచి పద్ధతి కాదని, ముందస్తుగా అదుపులోకి తీసుకున్న అందర్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువనేత బట్ట విజయ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, పూల పల్లి సుధాకర్ రెడ్డి,భజన సతీష్, చల్లా వెంకట్రావు, మహమ్మద్ ఖాన్, రహీం ఖాన్, ఎల్లంకి రాము, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, మంద నాగరాజు, విజయ్ రెడ్డి, ఎర్రబాబు, హరీష్, నాగ మురళి, కనీతి,కృష్ణ తదితరులు ఉన్నారు పాల్గొన్నారు