Telugu News

ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్

నిజామాబాద్ అర్బన్ - విజయం న్యూస్

0

ఎంపీ అర్వింద్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్

(నిజామాబాద్ అర్బన్ – విజయం న్యూస్):-

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలిసారిగా ఫైర్ అయ్యారు. నిజామాబాద్ లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అరవింద్‌పై ఇప్పటివరకు తాను ఏమీ మాట్లాడలేదని, కానీ ఇప్పటికీ ఆయన మభ్యపెడుతూనే ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశామని, పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇతర ముఖ్యమంత్రుల మద్దతు కూడా తీసుకున్నామని తెలిపారు. బాబా రాందేవ్, బాలకిషన్ వంటివాళ్లను కూడా తీసుకువచ్చి వారితో కూడా ఇక్కడ పసుపు బోర్డు ఆవశ్యకతను చెప్పించామన్నారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరిందని, ఇలా పలుమార్లు విన్నవించినా కేంద్రంలో చలనం లేదన్నారు.

also read :-మంత్రి నిరంజన్ రెడ్డి కి ఘన స్వాగతం

2017లో స్పైస్ బోర్డ్ ఆఫీస్, ఫీల్డ్ ఆఫీస్, డివిజన్ ఆఫీస్ ఇన్ని తీసుకొచ్చినా బీజేపీ మాత్రం సాయమందించలేదని, అయితే తానే పసుపు రైతులకు అంతా చేసినట్టు అరవింద్ చెబుతున్నాడని ఆమె ఆరోపించారు. అరవింద్వ పసుపు రైతులకు ఉచిత సలహాలు మాత్రమేనని ఎద్దేవాచేశారు.ఉత్తర మే రాయలేదంటున్న అరవింద్‌కు మీడియా ముఖంగా మా ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని చూపిస్తున్నా. ఈ మూడేళ్ళలో నాలుకకు మడత లేకుండా అరవింద్ అబద్ధాలు ఆడాడు. అన్ని భాషల్లో హైస్పీడ్ అబద్ధాలు చెప్పడం తప్పితే బీజేపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బీజేపీ ఏమీచేయదు. కావాలంటే కేంద్రంలో బీజేపీ పాలన. ఇక్కడ టీఆర్ఎస్ పాలనను ప్రజలు పోల్చి చూసుకోవాలి. అబద్ధాలకోరులను ప్రజలు తరిమికొట్టాలి’ అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

also read :-హిందూ సమాజం మేలుకోకుంటే ఉద్యోగాల్లో కూడా ప్రమాదమే

ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్న అరవింద్. ఎప్పుడు పసుపు బోర్డు తెస్తాడు? ఎప్పుడు మద్దతు ధర సాధిస్తాడో చెప్పాలి? అని ప్రశ్నించారు. మోకాళ్ళ యాత్ర చేస్తారో లేక కేంద్రం ముందు మోకరిల్లుతారోగానీ పసుపు బోర్డు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే రైతులే అడుగడుగునా అడ్డుకుంటారని హెచ్చరించారు.కాగా గ్రూప్ వన్ ఉర్దూ మీడియం పేరిట కొత్త వివాదం లేపకుండా కేంద్రం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో చెప్పాలని కవితా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.