Telugu News

కూసుమంచిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మదగ్గం

గిరిజనుల పట్ల బీజేపీ నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసన

0

కూసుమంచిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మదగ్గం
== గిరిజనుల పట్ల బీజేపీ నిర్లక్ష్యవైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసన
(కూసుమంచి-విజయంన్యూస్)
పార్లమెంటులో గిరిజన శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు గిరిజన బిల్లు పంపలేదని అబద్దపు మాటలు మాట్లాడిన వైఖరికి నిరసనగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కూసుమంచి మండల కమిటీ అధ్వర్యంలో కూసుమంచి సెంటర్ లో మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి,మోదీ దిష్టి బొమ్మ దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంధర్భంగా ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్యలు మాట్లడుతూ గిరిజనులపై గౌరవంతో సీఎం కేసీఆర్ గతంలోనే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి, గిరిజన మంత్రి ఆధ్వర్యంలో రిజర్వేషన్లపై ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, కానీ ఎలాంటి ప్రతిపాధనలు పంపించలేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ పచ్చి అబద్దాలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

also read;-బిజెపి  కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు ను బర్తరఫ్ చేయాలి

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భారత పార్లమెంటరీ వ్యవస్థను అవమానించారని, రాజ్యాంగాన్ని అవమానపర్చారని ద్వజమెత్తారు.కేంద్రం ప్రభుత్వ విధానాలు, వారు మాటలు తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపర్చేలా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్ పాషా, ఆత్మ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లు, వాసంశెట్టి వెంకటేశ్వర్లు, చంద్రారెడ్డి, డీసిసిబి డైరెక్టర్ శేఖర్ నాయకులు మల్లిడి వెంకటేశ్వరరావు సోషల్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు వడ్త్యా బాలకృష్ణ, పల్లె బోయిన శ్రీనివాస్, ఎంపిటిసిలు ఉడుగు జ్యోతి వెంకటేశ్వర్లు, భూక్య స్వాతి హరి, సర్పంచ్ లు పద్మ వెంకట్ రెడ్డి, బానోత్ పింప్లి బిక్షనాయక్, మూడు కోటు, కొండ సత్యం, లింగయ్య, ఆత్మ డైరెక్టర్లు అద్దంకి ఉపేంద్ర చారి, వాకా సుధారాణి, కూసుమంచి పట్టణ అధ్యక్షులు కొక్కిరేణి సీతారాములు, బానోతు శ్రీను నాయక్ వివిధ గ్రామాల పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు