Telugu News

ఖమ్మంలో ఎంపీ నామ విస్తృత పర్యటన

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు

0

ఖమ్మంలో ఎంపీ నామ విస్తృత పర్యటన

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-
ఖమ్మం లోక్ సభ సభ్యులు, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక తో కలిసి ఆదివారం నాడు ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన హావేలి వేస్ట్ సైడ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి పాల్గొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ దానావాయిగూడెం లో ఇటీవల మరణించిన తాడిశెట్టి కృష్ణయ్య  కుటుంబ సభ్యులను పరామర్శించారు.

also read;-బహుత్ అచ్చా ==అకట్టుకుంటున్నరఘునాథపాలెం బృహత్ పల్లెప్రకృతి వనం

అనంతరం మామిళ్లగూడెం లో ఇటీవల నెల్లూరు వీరబాబు కుమారుడు వివాహం జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. మొగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ నందు జరిగిన సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు కుమార్తెల ఓణీల అలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. చల్లపల్లి గార్డెన్స్ నందు జరిగిన ఎలినేని వెంకటరమణ బావమరిది కుమార్తె ఎంగేజ్మెంట్ కి హాజరై వధువు, వరులని ఆశీర్వదించారు అనంతరం తనికెళ్ళ గ్రామంలో సర్పంచ్ మోహన్ రావు ఇంట్లో జరిగిన ఉప్పలమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. అ

లానే ఖమ్మం బైపాస్ రోడ్డు లోని కృష్ణ ఫంక్షన్ హాల్ నందు జరిగిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 19వ మహాసభ లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, జడ్పీటీసీ వరప్రసాద్, బాణాల వెంకటేశ్వరరావు,సామినేని సతీష్ తదితరులు పాల్గొన్నారు.