Telugu News

నాటుసారా మరణాలను సహజ మరణాలంటారా: చంద్రబాబు

= అసెంబ్లీలో నిలదీస్తే సస్పెండ్‌ చేస్తారా

0

నాటుసారా మరణాలను సహజ మరణాలంటారా: చంద్రబాబు
== అసెంబ్లీలో నిలదీస్తే సస్పెండ్‌ చేస్తారా
== నిలదీసిని వారిపై కేసులు పెడుతూ పోతారా
== మృతుల కుటుంబాలకు టిడిపి అధినేత బాబు పరామర్శ
== జగన్‌ తీరుపై మండిపడ్డ చంద్రబాబు
(ఏలూరు-విజయంన్యూస్)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కల్తీసారా బాధిత కుటుంబాలను పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని బాధిత ఇళ్లకు ఇంటింటికి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. సారా కారణంగా మరణించిన కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. సారా వల్ల మరణించిన 26 మంది కుటుంబాలకు లక్ష చొప్పున సాయం అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు.

also read;-సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం: సీఎం జగన్

ఏపీలో మద్యం, నాటుసారా ఏరులై పారుతుందని ఆరోపించారు. వైసీపీ నాయకులే కల్తీ సారాను తయారి చేస్తున్నారని విమర్శించారు. పక్క రాష్టాల్ర నుంచి మద్యం తీసుకువచ్చి ఏపీలో అధిక ధరలకు విక్రయిస్తుందని మండిపడ్డారు. మద్య నిషేదం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని, ఎంతమందిని జైల్లో పెట్టినా భయపడేది లేదని అన్నారు. విూ విూదే కాదు తన విూద కేసులు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ పై కేసులు ఉన్నాయి కాబట్టి, అందరిపైనా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పై ఉన్నవి నిజమైన కేసులు.. తమ విూద ఉన్నవి దొంగ కేసులను పేర్కొన్నారు.

also read;-చెరువులో పడి తాత, కొడుకు, మనుమడు మృతి

నాటుసారా మృతుల కేసులన్నీ సహజ మరణాలని అంటున్న జగన్‌ కు పరిపాలించే అర్హత ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఆయన పరిపాలించే అర్హత కోల్పోయాడన్నారు. అసెంబ్లీలో తప్పులు మాట్లాడితే, సస్పెండ్‌ చేస్తానని అచ్చెన్నాయుడుని జగన్‌ అన్నారని చెప్పారు. ఇప్పుడు అబద్దాలు చెబుతున్న జగన్‌ ను డిస్మిస్‌ చేయాలా వద్దా? అని ప్రశ్నించారు. జగన్‌ కు భవిష్యత్తులో ఓట్లు వేయకుండా అందరిని సమాయత్తం చేయాల్సిన బాధ్యత పేదలపై ఉందన్నారు. యల్‌ జీ పాలిమర్స్‌ మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చావు.. అది నీ అబ్బ సొమ్మా? అని ప్రశ్నించారు. నాటుసారా బాధితులకు ఇవ్వవా? అని కూడా ప్రశ్నించారు. నాటుసారా బాధితులకు ప్రభుత్వ సౌకర్యాలను కట్‌ చేస్తే, అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహ చెల్లిస్తానని స్పష్టం చేశారు.

ఇంత నీచమైన, ఇంత అబద్దాల ముఖమంత్రిని తన జీవితంలో చూడలేదని, ఆ పదవికి కళంకం తెచ్చిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. నాటు సారా వల్లనే జంగారెడ్డిగూడెం వరుస మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. అంతేకాకుండా సహజ మరణాలు అంటూ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, అసెంబ్లీలో అసత్య ప్రచారం చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్‌ ను ప్రజలు డిస్మిస్‌ చేయాలన్నారు. టీడీపీ తరఫున మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున నష్ట పరిహారాన్ని చంద్రబాబు ప్రకటించించారు. ప్రభుత్వం 25 లక్షల రూపాయలు వంతున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 25 లక్షల నష్ట పరిహారం ఇస్తామని, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా మృతుల పిల్లలను చదివిస్తామని హావిూ ఇచ్చారు.