తొలి ప్రసంగంలోనే కశ్మీర్ పై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహ్ బాజ్
న్యూఢిల్లీ పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహ్‌బాజ్ షరీప్
తొలి ప్రసంగంలోనే కశ్మీర్ పై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహ్ బాజ్
—-న్యూఢిల్లీ పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహ్‌బాజ్ షరీప్
—-తన తొలి ప్రసంగంలోనే కశ్మీర్ అంశంపై నోరుపారేసుకున్నారు.
—-కశ్మీర్‌లో 370 అధికరణను ఇండియా రద్దు చేయడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
(న్యూఢిల్లీ -విజయంన్యూస్);-
కశ్మీర్ ప్రజల హృదయాలు రక్తమోడుతున్నాయని, వారికి దౌత్యపరంగా, నైతికంగా పాక్ మద్దతు ఇస్తుందని అన్నారు.వీటితో పాటు ప్రతి అంతర్జాతీయ వేదకలపైన ఈ అంశాన్ని ప్రస్తావిసూనే ఉంటామన్నారు.భారత్‌తో సత్సంబంధాలను తాము కోరుకుంటున్నామని ఆయన చెబుతూనే, కశ్మీర్ అంశం పరిష్కారం కాకుండా అది సాధ్యం కాదని అన్నారు.
also read :-రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చవితి ప్రేమ
2019 ఆగస్టులో 370వ అధికరణను ఇండియా రద్దు చేయగానే ఇమ్రాన్ ఖాన్ ఆ విషయాన్ని ఎంతమాత్రం సీరియస్‌గా తీసుకోలేదని, దౌత్యపరమైన ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు.’కశ్మీరీ ప్రజల రక్తం రోడ్లపై పారింది, కశ్మీర్ లోయ రక్తసిక్తమైంది”అని షెహ్‌బాజ్ అన్నారు.కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ శాంతి అసాధ్యమని చెప్పారు.