Telugu News

నేటి నుంచి నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనం నుండే పౌర సేవలు.

సకల సౌకర్యాలతో ప్రజలకు సేవలు

0

నేటి నుంచి నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనం నుండే పౌర సేవలు..

◆ సకల సౌకర్యాలతో ప్రజలకు సేవలు

◆ 4ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.22కోట్లతో నిర్మాణం.

◆ డివిజన్లో చెత్త సేకరణకై మినీ వ్యాన్(15), ట్రాక్టర్లు(10) ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

◆ పౌర సేవల ఇక నుండి నూతన కార్యాలయం నుండి పొందాలని మంత్రి విజ్ఞప్తి.

(ఖమ్మం  విజయం న్యూస్)’-

ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు రూ.22 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం భవనం నుండే నేటి నుండి పౌర సేవలు అందుబాటులో ఉంటాయని, వాటిని ప్రజలు సద్వినియోగంగించుకొవవాలని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  విజ్ఞప్తి చేశారు.ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని డివిజన్లో చెత్త సేకరణకై మినీ వ్యాన్(15), ట్రాక్టర్లు(10) ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

also read ;-ఫారెస్ట్ ప్లాంటేషన్ పనులను అడ్డుకున్న పోడు సాగుదారులు

అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి ని తన కార్యలయంను అధికార స్థానంలో కూర్చోబెట్టారు. పౌర సేవలకు ఇబ్బంది కలుగకుండా నిత్యం అందుబాటులో అంటు ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ నందు నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ నిర్వహణ పూర్తి బాధ్యతలు మంత్రి కేటిఆర్  నిర్వర్తిస్తూన్నందున ఖమ్మం పర్యటన వాయిదా పడిందని, పూర్తి స్థాయి కార్యలయంను మంత్రి కేటిఆర్  చేతులమీదగాత్వరలోనేప్రారంభిస్తామన్నారు.ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా నగర ప్రజలకు పౌర సేవలను చేరువచేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఅర్ , పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సహకారంతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనంను నిర్మించడం జరిగిందన్నారు.

also read :-కన్నాయిగూడెం, వైన్స్ షాప్ లో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు

అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించామన్నారు. ఖమ్మం బోనగర నడిబొడ్డున 4ఎకరాల సువిశాలమైన స్థలంలో ముఖ్యమంత్రి వాగ్దాన నిధులు రూ.22కోట్లతో రాబోయే తరాలకు సరిపోయే విధంగా అన్ని వసతులతో కార్యలయం తీర్చిదిద్దామని వివరించారు.

ప్రత్యేక డిజైన్‌తో ఉద్యోగులు, ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు.సుమారు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో కార్యాలయంను నిర్మించనున్నారు.కౌన్సిల్ సమావేశాల నిమిత్తం 150 మంది కూర్చునేందుకు విశాలమైన పెద్ద హల్, డ్యుయల్ కుషన్ సీటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్ , సెంట్రల్ ఏసీ తదితర సౌకర్యాలతో ఎర్పాటు చేసినట్లు చెప్పారు.

also read :-విద్యుత్ ఘాతుకానికి ముగజీవాలు మృతి

గ్రేటర్‌ హైద్రాబాద్ తరువాత అంతటి విశాలమైనది ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయ భవనం అని వెల్లడించారు.ఇక నుండి మున్సిపాలిటీకి సంబందించిన ప్రతి సేవలు నూతన మున్సిపల్ భవనం నుండే పొందాలని ప్రజలను కోరారు.

మంత్రి వెంట జిల్లా కలెక్టర్ VP గౌతం , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , మేయర్ పునుకొల్లు నీరజ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార సుడా చైర్మెన్ బచ్చు విజయ్ AMC చైర్మన్ లక్ష్మిప్రసన్న , మున్సిపల్ అధికారులు & సిబ్బంది, కార్పొరేటర్లు ఉన్నారు.