Telugu News

తెలంగాణ రాష్ట్రంలో రైతుకు విలువలేదు

== రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ ను బొందబెట్టుడు ఖాయం == ఇప్పుడు రైతులు కేవలం ఓటర్లు.. రాజన్న రాజ్యంలో రైతులు దేవుళ్లు == రైతులు కోటేశ్వర్లను చేయమంటే ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నరు == రైతుబంధు పెద్ద మోసం.. ఇప్పుడు దళితబంధుతో మరో మోసానికి తెరలేపారు == దళితులను ఎన్నిసార్లు మోసం చేస్తరు..? == సీఎం కేసీఆర్ పై మండిపడిన షర్మిళ == ఇల్లందు మండలం బొజ్జాయి గూడెం లో రైతు గోస దీక్ష లో పాల్గొన్న వైఎస్ షర్మిల

0

తెలంగాణ రాష్ట్రంలో రైతుకు విలువలేదు
== రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ ను బొందబెట్టుడు ఖాయం
== ఇప్పుడు రైతులు కేవలం ఓటర్లు.. రాజన్న రాజ్యంలో రైతులు దేవుళ్లు
== రైతులు కోటేశ్వర్లను చేయమంటే ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నరు
== రైతుబంధు పెద్ద మోసం.. ఇప్పుడు దళితబంధుతో మరో మోసానికి తెరలేపారు
== దళితులను ఎన్నిసార్లు మోసం చేస్తరు..?
== సీఎం కేసీఆర్ పై మండిపడిన షర్మిళ
== ఇల్లందు మండలం బొజ్జాయి గూడెం లో రైతు గోస దీక్ష లో పాల్గొన్న వైఎస్ షర్మిల
(ఇల్లందు-విజయంన్యూస్)
పత్తి పంట వేయోద్దన్నరు.. ఆ తరువాత తెల్లబంగారం రైతులకు వరం అన్నరు.. పత్తి పంటను సాగు చేసుకోమన్నరు.. మొన్న వరి పంట వద్దు.. వరి పంట వేసే ఉరే అన్నరు.. నిన్న వరి కొంటం రైతులు ఇబ్బంది పడోద్దంటరు..? అసలు రైతులను మీరు మోసం చేస్తున్నరా..? రైతులను అడుకుంటున్నరా..? తెలంగాణ రాష్ట్రంలో రైతులకు విలువ ఉందా..? రైతులను ఓట్ల కోసమే వాడుకుంటున్నరు..? రైతులు తెలంగాణలో జరుగుతున్న మోసాన్ని గమనించాలని వైఎస్ ఆర్ టీపీ అదినేత్రి వైఎస్ షర్మిళ తెలంగాణ ప్రభుత్వం పై మండిపడ్డారు. మహాప్రజాప్రస్తానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిళ చేపట్టిన పాదయాత్ర భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు వేలాధి మంది జనం తరలివస్తున్నారు. అడుగడుగున జనం నిరాజనాలు పడుతున్నారు.

ఇల్లందులో జరిగిన బహిరం సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలందరని అప్యాయతగా పలకిరిస్తున్న వైఎస్ షర్మిళ వాళ్ల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో, రైతు దీక్షలో ఆమె మాట్లాడుతూ రైతు అంటే మోసం తెలియని వాడు, రైతు లేక పోతే రాజ్యం లేదు, రైతు లేకపోతే జనం లేరు.. రైతే లేకపోతే మనం మాడి మసి అవుతాం, అలాంటి రైతులను తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిలువున మోసం చేస్తూ ఆయన మాటల గారడిలో పడేసి నట్టెట ముంచేస్తున్నారని ఆరోపించారు. మూడునెలల కోసారి మాటమారుస్తూ రైతులను తికమకకు గురి చేస్తున్నారని అన్నారు.

అసలు తెలంగాణ రాష్ట్రం లో రైతు కి విలువ లేదని, రైతులను బొమ్మళ్లా అడుకుంటున్నారని ఆరోపించారు. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కోటీశ్వర్లను చేస్తానన్న సీఎం కేసీఆర్ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ ఉన్నప్పుడు వ్యవసాయం పండుగలా జరిగేదని, రాజన్న రాజ్యంలో రైతులను దేవుళ్లుగా పూజించే వాళ్లని అన్నారు. ఇప్పుడు రైతులను ఆడుకునే బొమ్మలను, బానిసలను చేస్తున్నారని ఆరోపించారు. నాడు రాజన్న రైతులకు పంట నష్ట పరిహారం సకాలంలో ఇచ్చేవారని, చాలా గొప్పగా వైఎస్సార్ నష్టపరిహారం ఇచ్చేవారని అన్నారు. కానీ ఇప్పడు పంట నష్టపరిహారం ఊసేలేదని ఆరోపించారు.

also read :- మావోయిస్టుల విధ్వంసం
== దళితులను మోసం చేస్తున్న కేసీఆర్
దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చామని చెప్పిన సీఎం కేసీఆర్ ఎంత మంది దళితులకు మూడేకరాల భూమిని ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక ఇప్పడు మరో మోసానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. దళితులకు దళితబంధు అంటూ ఒక్కోక్కరికి రూ.10లక్షలను ఇస్తానని మాటిస్తున్నారని, ఎంత మంది దళితులకు మీరు రూ.10లక్షలు ఇస్తారు..? రాష్ట్ర బడ్జెట్ ఎంత..? రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలేన్ని..? ఎలా దళితబంధు అందరికి అమలు చేస్తారని ప్రశ్నించారు. దళితులను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ అడుతున్న ఎన్నికల డ్రామా అని యద్దేవా చేశారు. దళితులకు రూ.10లక్షలు ఎందుకు ఇవ్వాలనే మూడేకరాల భూమి ఇస్తే రూ.30లక్షల పంట ద్వారా వచ్చేవని అన్నారు. దళితులను అసలు మనుషులుగా చూస్తున్నారా..? ప్రశ్నించారు. ఎన్నికల ముందు పోడు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని, కేవలం ఓట్లతో కేసీఆర్ కి పని అని దుయ్యబట్టారు. ప్రజలకు కేసీఆర్ బొడి గుండు కొడుతున్నారని ఆరోపించారు. ఎస్సీలను,ఎస్టీ లను కేసీఆర్ ఘోరంగా మోసం చేశారని, మహిళల మాన ప్రాణాలను కాపాడ లేని సీఎం ఉరి వేసుకొని సచ్చిపోవాలని విమ్మర్శించారు. వరి వేయొద్దని చెప్పి మోసం, వరి వేస్తే ఉరి అన్ని మోసం, ఆ తరువాత వరి వేసిన పంట ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మోసం. ప్రజలందర్ని మోసం చేసుడే సీఎం కేసీఆర్ పని అని అన్నారు.

also read :- 8 ఏండ్లుగా ఇంటి స్థలాలు ఎందుకు ఇవ్వలేదు..?: భట్టి

ప్రజలు భయపడి సగానికి సగం పంట వేయలేదు, 30లక్షల ఎకరాల్లో కొంటామని ఇప్పుడు చెప్తున్నారు, మిగతా రైతులు పంట వేసుకోలేదు, 17 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయకుండా ఉన్నారు, సాగుబడి చేయకుండా 17లక్షల ఎకరాల బీడు భూములకు వెంటనే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పంట వేసుకున్న రైతులకు మద్దతు ధర లేదా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కి రైతులను మోసం చేయడమే ఆయన పని అని ఆరోపించారు. సబ్సిడీ అని మోసం…పంట భీమా అని మోసం..యంత్ర లక్ష్మి అని మోసం.. మోసం..మోసం అంటూ షర్మిళ ప్రభుత్వంపై పైర్ అయ్యారు. ప్రజలు గొర్రెళ్లా కాకుండా అంబేద్కర్ ఎలా ఆలోచన చేస్తాడో అలా ఆలోచించాలని సూచించారు. తెలంగాణ రైతులు అంతా ప్రభుత్వంపై తిరగబడాలని కోరారు.