Telugu News

నోరుజారా.. నన్ను క్షమించండి.. ఎంపీ ధర్మపురి అర్వింద్

నిజామాబాద్ విజయం న్యూస్

0

నోరుజారా.. నన్ను క్షమించండి.. ఎంపీ ధర్మపురి అర్వింద్

(నిజామాబాద్ విజయం న్యూస్ ):-
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను నోరుజారానని.. మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుడికాలు చెప్పు ఎల్లమ్మకి ముడుపు పెట్టినవా అని చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పారు. తెలంగాణ గ్రామాల్లో ఎడమ చేత్తో పనిచేస్తుంటే కుడిచేయి ఎల్లమ్మకి ముడుపు పెట్టినవా ఏంటని అంటుంటారని.. అదే తరహాలో కేటీఆర్ కుడికాలు అనబోయి కుడికాలు చెప్పు అని నోరుజారిందని ఆయన వివరణ ఇచ్చారు.

also read :-దేవాలయాలపై దాతృత్వం చాటుకున్న మాజీ ఎంపీ పొంగులేటి

ఎల్లమ్మకు కోడిని బలిచ్చినా కాళ్లు ముడుపు కింద కడతారని.. అదే తరహాలో తాను కుడికాలు అనబోయి కుడికాలు చెప్పు అన్నానని అర్వింద్ అన్నారు. ఎల్లమ్మ తల్లిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. ఎన్నోసార్లు గ్రామదేవత ఎల్లమ్మ తల్లి పూజల్లో పాల్గొన్నానని.. దావత్‌లు కూడా ఇచ్చానని ఆయన చెప్పారు. హిందూ సోదరులందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. అలాంటి పదం వాడినందుకు క్షమించాలని కోరారు.