Telugu News

కష్టపడి కాదు… ఇష్టపడి చదవాలి:పొంగులేటి

గ్రేస్ కాలేజీ విద్యార్థుల సమ్మేళనంలో పొంగులేటి

0

కష్టపడి కాదు… ఇష్టపడి చదవాలి:పొంగులేటి

– గ్రేస్ కాలేజీ విద్యార్థుల సమ్మేళనంలో పొంగులేటి

ఖమ్మం-విజయంన్యూస్:

ప్రతిఒక్కరూ విద్యార్థులకు కష్టపడి చదవాలని చెబుతుంటారని కానీ ఇష్టంతో చదివినప్పుడే విద్యార్థి చదువుకున్న చదువుకు అర్థం… పరమార్థం రెండూ ఉంటాయని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. కొణిజర్లలోని గ్రేస్ కాలేజిలో ఇంటర్, ఎం ఎల్ టి  గ్రూపు కి చెందిన విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది. ఈ సమ్మేళనానికి పొంగులేటి ముఖ్య అతిధి గా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, సర్పంచ్ పరికపల్లి శ్రీను, రాయల పుల్లయ్య, ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, కన్నెగంటి రావు, కొనకంచి మోషే, శివ, గడల నరేందర్ నాయుడు, రచ్చా రామకోటయ్య, ఊటుకూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

== వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవం లో పొంగులేటి

సుజాతనగర్ : సుజాతనగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రతిష్ఠా మహెూత్సవంలో ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ప్రత్యేక పూజాది కార్యక్రమంలో పొంగులేటి పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటి సభ్యులు ఆలయ మర్యాదలతో మాజీ ఎంపీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటితో పాటు డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తూము చౌదరి, రజాక్ భాయ్, చీకటి కార్తీక్, మైనారిటీ నాయకులు గౌస్ భాయ్, భోజ్యానాయక్, వస్యానాయక్, లింగం పిచ్చిరెడ్డి, సామ్యానాయక్, దొడ్డి రామకృష్ణా, మంగ్నా, ఉడుముల శ్రీనివాస రెడ్డి, చీమట నాగేశ్వర రావు, భూక్య రామదాసు, భూక్య రాములు, మల్లెల శ్రీను, రామనాధం, క్రిష్ణవేణి, ముత్యాల మల్లయ్య, వజ్రాల నాగేశ్వర రావు, మరాల కోటేశ్వర రావు, బండా వెంకటేశ్వర్లు, సత్యనారాయణ రెడ్డి, తాండ్ర నాగబాబు, దుర్గారాశి సతీష్, కలకోటి రాజు, ఎంవీ రెడ్డి, రాము, నవీన్, నిరంజన్ రెడ్డి, పండు, చిన్ని, శ్యాం, మహేష్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: 24గంటల్లో న్యాయం చేయాలి..లేకుంటే స్టేషన్ కు వస్తా: పొంగులేటి

== మధిరలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

మధిర : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మధిర మండలంలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా దెందుకూరులో జరిగిన ముక్కర వర్షారెడ్డి కుమారుని వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. వంగవీడులో శీలం అన్నపూర్ణమ్మ పెద్దకర్మలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ కోట రాంబాబు, యన్నం కోటేశ్వర రావు, లక్ష్మారెడ్డి, కటికల సీతారామిరెడ్డి, మొండితోక జయాకర్, ఉమ్మినేని కోటయ్య తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై..?