*మరోసారి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి:
(హైదరాబాద్:విజయం న్యూస్):-
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. సుఖేందర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో మండలి ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నిక అనంతరం సుఖేందర్ రెడ్డి ఛైర్మన్ స్థానంలో కూర్చున్నారు. ఆయనకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి సేవలను మంత్రులు కొనియాడారు.
also read;-ఎరుపెక్కిన భద్రాచలం
గత జూన్ మొదటిసారి మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి
కాగా, గత జూన్ మొదటి వారం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్‌గా సేవలందించారు. గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో.. ప్రోటెం చైర్మన్‌గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.*