Telugu News

వెల్లువెత్తిన సంబరాలు..

మున్సిపల్, మేప్మా, ఐకేపీ ల వేతనాలు పెంపు

0

వెల్లువెత్తిన సంబరాలు..

– మున్సిపల్, మేప్మా, ఐకేపీ ల వేతనాలు పెంపు

– కార్మికులు, ఉద్యోగుల్లో హర్షం..సంబురాలు చేసుకున్న సిబ్బంది.

– సీఎం కేసీఆర్‌ కు క్షేరాభిషేకం, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు.
మేప్మా, ఐకేపీ,మున్సిపాలిటీల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, ఇంజినీరింగ్‌, వాటర్‌వర్క్స్‌, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్లు, బిల్‌ కలెక్టర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి వేతనాలు పెంపు పట్ల కార్మికుల హర్షం వ్యక్తం చేశారు.

బుదవారం ఖమ్మం వీడీవోస్ కాలనీలోని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజ్ అధ్వర్యంలో కార్మికులు, టీఆర్ఎస్ కేవీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి క్షేరభిషేకం చేసి జై.. కేసీఅర్.. జై తెలంగాణ అంట నినాదాలు చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణి అనంతరం బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటారు.

also read;-బిసి స్టడీసర్కిల్ భవనం సిద్ధం

ఈ సందర్భంగా వక్తలు మాట్లడుతూ..

ఉద్యోగులు, కార్మికుల కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతూ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ వేతనాలు పెంచేందుకు కృషి చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, ఉప మేయర్ ఫాతిమా జోహారా, CWC చైర్మన్ భారతిరాణి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, రాపర్తి శరత్, నాయకులు RJC కృష్ణ, షకీనా, దేవభక్తుని కిషోర్ బాబు, కంచర్ల, అంజిరెడ్డి, దయాకరఇసాక్, కొల్లు పద్మ, సలీం, వాలబాయిన వేంకటేశ్వర్లు, జహుర్, యేచ్చు ప్రసాద్, ఫ్రాన్సిస్, MEPMA, IKP సిబ్బంది ఉన్నారు.