Telugu News

పాలేరు కారు పార్టీలో కలవరం

ఒకతాన గూడిన నియోజకవర్గ గులాబీనేతలు

0

పాలేరు కారు పార్టీలో కలవరం
== ఒకతాన గూడిన నియోజకవర్గ గులాబీనేతలు
== ఖమ్మం జూబ్లీక్లబ్ లో మాటముచ్చట
== ఆ ఇద్దరు కలిస్తే పక్కనోడు పటాస్ అంటూ ప్రకటన
== మళ్లోసారి కలుసుడుందని చెప్పిన సీనియర్ నేత
== మస్తుగా చర్చకొచ్చిన నేతల కలయిక
(కూసుమంచి-విజయంన్యూస్);-
పాలేరు నియోజకవర్గ కారు పార్టీలో కలవరం షూరు అయ్యినట్లే కనిపిస్తోంది.. కందాళ వర్సెస్ తుమ్మల అంటూ ఇప్పటి వరకు వర్గపోరు కొనసాగిన.. గిప్పుడు అది కాస్త మారేటట్లు కానోస్తుంది.. ఓడినోళ్లిద్దరు అక్కటి కావాలని వాళ్ల పక్కన తిరిగిటోళ్లు అనుకుంటున్నరు.. అట్లైతేనే మస్తుగా ఉంటదంటున్నరు.. శత్రువును కొట్టాలంటే పక్కనోళ్లు ఒక్కటి కావాలా అంటూ ఆ నేతలు మాట్లడుతున్నరు.. అట్ల జరిగితేనే కొమ్ములొచ్చినోళ్లకు బుద్ది చెప్పినట్లైతని భావించి తీర్మానం చేసిండ్రూ..గిదే ముచ్చటను పెద్ద సార్లకు చెప్పిండు.. గా సార్లేమన్నరో తెల్వదు కానీ.. ఆ గిద్దరు ఓడినోళ్ల పక్కన తిరిగిటోళ్ల చికటి ముచ్చట మాత్రం ఖమ్మం జిల్లాలోనే సంచలనమైంది. ఎన్నికలు రాట్లేదు గిప్పుడే ఎందుకు ఒకతాన చేరిండ్రూ అని కారు పార్టోళ్లందరు ముచ్చటించుకున్నరు..

also read :-తెలంగాణ వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం

ఖమ్మంలో గేందో జరుగుతున్నదని పార్టీ పెద్దసారు అరా తీసినట్టు తెలుత్తాంది.. ఖమ్మంజిల్లా పాలేరు నియోజకవర్గంలో కందాళ వర్సెస్ తుమ్మల వర్గపోరు రగులుతూనే ఉంది. గడ్డివాముకు నిప్పు తగిలితే నిండేడు చెరువు నీళ్లు పోసిన నిప్పు అరిపోనట్లుగా పాలేరు నియోజకవర్గ కారుపార్టీలో వర్గపోరు మంటలు అరడం లేదు.. ఎన్నికలు సమీపిస్తున్న కాడనుంచి ఆ వర్గపోరు మంటలు పైపైకి ఎగిసిపడుతున్నయ్. దీంతో కారుపార్టీ కార్యకర్తలు కలవరపడుతున్నరు. గిదేంది.. సర్కార్ ఉన్నకాడ సక్కంగా పనిచేసుకోవాల్సినోళ్లు పట్టుపట్టుమని పైటింగ్ చేస్తున్నరేంటని కార్యకర్తలు మస్తు గాబర పడుతున్నరు. గిట్లైతే కార్యకర్తలకు కష్టమొస్తని తెల్చి చెబుతున్నరు.. గసలేం జరిగింది.. ఎందుకు ఒక తాన కూడి ముచ్చటించుండ్రో చూద్దాం

also read :-నవ భారతానికి సీఎం కేసిఆర్ మార్గదర్శి : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పాలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఖమ్మం బస్తీలా ఒకతానకు చేరిండ్రూ.. ఖమ్మంలోని ఓ హోటళ్లలో రహస్యంగా భేటి అయ్యిండ్రూ.. నియోజకవర్గంలో రాజకీయం గురించి మస్తుగా మాట్లాడిండ్రూ.. రాబోయే రోజుల్లా మన పరిస్థితి ఏంటని చర్చించుకున్నరు.. ఆ మీటింగ్ తానకు ఎవల్ని రానియ్యలే.. విలేకర్లు వచ్చిన బయటనే ఉంచిండ్రూ.. గిదేందని అడిగిన వాళ్లు మాటినలే.. ఓ చాలా సేపు ముచ్చట బెట్టిండ్రూ.. పొద్దుగళ్ల 10.30గంటలకు షూరు అయిన ముచ్చట.. మాపటేళ్ల 4గంటల వరకు ముచ్చటించిండ్రూ.. లోపల ఏం మాట్లడుకున్నరో తెల్వదు కానీ.. బయటకు అచ్చిన తరువాత విలేకర్లకు నాలుగు ముచ్చట్లు చెబుతమన్నరు..

also read;-పంజాబ్‌లో ఓడిన సోనూసూద్‌ సోదరి
== మాజీలిద్దరు ఒక్కటి కావాలనని నిర్ణయం..?
గులాబీ పార్టీని ఒంటిచేత్తో మోసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రజా అకర్షణ కల్గిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అక్కటి కావాలని వారి ఇరువురి అనుచరులు ముచ్చటించినట్లు తెలుస్తాంది..? వాళ్లిద్దరకు, వాళ్ల పక్కన తిరిగేటోళ్లకు ఎమ్మెల్యే, మంత్రి మనుషులు మస్తుగా అవమానిస్తున్నరని, తప్పడు కేసులు పెడుతున్నరని ముచ్చటించుకున్నట్లు తెలుత్తాంది. పక్క పార్టీ నుంచి అచ్చని నాయకులు, స్వంత పార్టీకి మోసం చేసి కారు గుర్తును ఓడించిన కొందరు నాయకులు ఎమ్మెల్యే పక్కన చేరి అందర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నరి మస్తు గరమైయ్యిండ్రు.. ఆయనకు చెక్ పెట్టాలంటే మాజీలిద్దరు అక్కటి కావాల్నని తీర్మాణించుకున్నట్లు తెలుస్తాంది. అందుకు ఆ నేతల్ని కలిసి ఇద్దర్ని అక్కటి చేయాలని అందుకు ప్రధాన నాయకులు బాథ్యత తీసుకోవాలన్నని నిర్ణయించండ్రూ. అట్లనే మళ్లోక్క మారు ముచ్చటించుకుందామని అనుకుంటన్నరంటా..? నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో అందరు ఒక తానా చేరాలని ఒప్పుకున్నరంటా..? గిదే ముచ్చటను తుమ్మల వర్గం నేతలు చెప్పిండ్రూ..

== పార్టీ ఓడిపోవద్దనే కార్యాచరణ చేస్తున్నం : నరేష్ రెడ్డిటీఆర్ఎస్ పార్టీ అదినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలా తెలంగాణ రాష్ట్రంలో మస్తుగా పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తుంటే, రాష్ట్రమంతటా పార్టీ జోరుమీదుంటే పాలేరు నియోజకవర్గంలా మాత్రం నలుగురి చేతిలో రాయిగా మారిందని రామసహాయం నరేష్ రెడ్డి విలేకర్ల ముచ్చటలో చెప్పిండు. మీటింగ్ తరువాత బయటకు అచ్చిన నరేష్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మీటింగ్ గురించి చెప్పిండు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే స్వచ్ఛమైన కారుగుర్తు కోసం కోట్లాడిన నేతలను పక్కనబెట్టి, కారు గుర్తుకు మోసం చేసినోళ్లను పక్కనేసుకుని పార్టీకి బద్నాం చేసే పనులు చేస్తున్నరని ఆరోపించిండు. సీనియర్లు అనే ఆలోచన లేకుండా పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా పాలేరు నియోజకవర్గంలో పరిపాలన చేస్తున్నరని అన్నడు. గిదేట్లా అని అడిగితే కచ్చిరులో కూకుండా బెడుతున్నరని చెప్పిండు. గట్టిగ మాట్లాడితే జైలుకు పంపిస్తున్నరని ఆరోపించిండు.

also read:-సిఎం కెసిఆర్ కు విశ్రాంతి అవసరం

అందుకే కారు పార్టీని నమ్ముకున్నోళ్లంగా, టీఆర్ఎస్ పార్టీ కోసం, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాలని ముందస్తుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనుషులం ఒక తాన కూడి ముచ్చటించినమని చెప్పిండు. మళ్లోక్కసారి కుచ్చుంటమని, అప్పుడు మేమేం చేయబోతున్నమో.. అక్కడ చెప్పుతమని తెల్చిచెప్పిండు. అయితే మాజీలిద్దరు ఒక్కతాన చేరి ముందుకు పోతే రాబోయే రోజుల్లో పార్టీ 10కి 10 స్థానాలను గెలుస్తుందని తెలిపారు. పార్టీకి ద్రోహం చేసే పనులేవ్వరు చేయడం లేదని, గట్ల చేసినోళ్లమే అయితే ఎప్పుడో పార్టీ లేకుండా చేసిటోళ్లమని చెప్పిండు.. మాకు ఆ తప్పు చేసేటంతా అవసరం లేదని, పార్టీని నమ్ముకున్నోళ్లం, నమ్మకంగానే పని చేస్తమన్నరు.

also read :-వైకుంఠానికి పోవుడంటే నరకమే..?
== చర్చాంశనీయమైన తుమ్మల వర్గీయుల బేటి
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. గత కొద్ది రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వంత పార్టీ నాయకులపై విమ్మర్శలు చేస్తే, ఆ తరువాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో బాంబు పెల్చాడు. టిక్కెట్ వచ్చిన రాకపోయిన పాలేరు నుంచే పోటీ చేస్తనని స్పష్టం చేసి పర్యటన చేస్తున్నరు. ఇంతలో జూపల్లి క్రిష్ణారావు అకస్మీకంగా మాజీలిద్దర్ని వేరువేరుగా కలిసి మాట్లాడటం, వెనువెంటనే పొంగులేటి మరో బాంబు పెల్చడం జరిగింది.

సీటు వచ్చిన రాకపోయిన రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని, నన్ను ఇతర పార్టీల నాయకులు పిలుస్తున్నరని, అవకాశం ఇవ్వకపోతే వెళ్లిపోవడం ఖాయమని స్పష్టం చేసిండ్రు. అంతలోనే మరసటి రోజు శుక్రవారం తుమ్మల, పొంగులేటి వర్గీయులు రహస్య సమావేశం కావడంతో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందనే చెప్పాలి. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ నేతల పనితీరుపట్ల ఆయోమయం, గందరగోళంగా ఉన్నారు. ఖమ్మం జిల్లా కారు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని కార్యకర్తలు చెబుతున్నరు.. మొత్తానికి శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన అంతర్గత సమావేశంతో టీఆర్ఎస్ పార్టీలో కలవరం షూరు అయ్యిందనే చెప్పాలి. అయితే రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో..? వేచి చూడాల్సిందే..?