పార్టీ ద్రోహి తుమ్మల : బెల్లం వేణు
== పాలేరు అడ్డా కందాళ గడ్డ
== తుమ్మల ఏం చేశారని ఇప్పుడోస్తున్నారు
== మూడేళ్ల నుంచి ఎటుబోయారు..
== కార్యకర్తలకు భరోసా ఇవ్వని వాళ్లు నాయకుడేళా అవుతారు
== మాకు మాకు మధ్య చిచ్చు రేపేందుకే పర్యటన చేస్తున్నరా..?
== పార్టీ విధానాలు నచ్చకుంటే పార్టీ నుంచి తప్పుకొండి
== విలేకర్ల సమావేశంలో కందాళ వర్గీయుల ఆగ్రహం
(నేలకొండపల్లి, కూసుమంచి-విజయంన్యూస్);-
పార్టీకి ద్రోహులంటూ బెదిరింపులకు దిగుతే బెదిరిపోయే వ్యక్తులం కాదని, స్థానిక నాయకులమని, మాకు మాకు మధ్య చిచ్చు పెట్టేందుకే తుమ్మల పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వర్గీయులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. పార్టీ ద్రోహులేవ్వరో ప్రజలందరికి తెలుసుకాబట్టే 2018 ఎన్నికల్లో సరైన సమాధానమిచ్చారని పేర్కొన్నారు. పాలేరు గడ్డ కచ్చితంగా కందాళ అడ్డా అని, ఎందుకంటే ఆయన స్థానికుడు. కార్యకర్తలకు, నాయకులకు భరోసానిచ్చే నాయకుడు ఆయన అని అన్నారు. అందుకే కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కందాళ ఉపేందర్ రెడ్డి విజయం తథ్యమంటూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వర్గీయులు స్పష్టం చేశారు. భయపెడితే భయపడేటోళ్లం కాదని, భయపడేవారు,
also read;-ఖమ్మంలో.. తీగల వంతెనను పరిశీలించిన మంత్రి పువ్వాడ
పార్టీకి మోసం చేసినవారు మీ చుట్టే తిరుగుతున్నరని ఆరోపించారు. పార్టీ విధానాలు నచ్చకుంటే గౌరవంగా తప్పుకోవాలని, ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. . గురువారం నేలకొండపల్లి మండల కేంద్రంలోని వాసవీ భవన్లో జరిగిన నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఖమ్మం గ్రామీణ టీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నంబ్రహ్మం, కూసుమంచి మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఆత్మకమిటీ చైర్మన్ రామసహాయం బాలక్రిష్ణారెడ్డి, నేలకొండపల్లిమార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
also read :-నదులపై కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
నేలకొండపల్లి మండలంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తూ ఆయన పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తుమ్మల కార్యకర్తలను నిందించారని ఆరోపించారు. ఆయన గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులను, కార్యకర్తలను విమర్శించడం తగదని హితవు పలికారు. తుమ్మల తన సొంత మండలంలోని సొంత గ్రామాల్లో మెజారిటీని తెప్పించలేకపోయారని ఈ సందర్భంగా వివరించారు. అందుకు తగిన సాక్షాల ప్రతులను విలేకరులకు ఆయన అందించారు. దీనిని బట్టి నిజమైన రాజకీయ ద్రోహి ఆయనేనని స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావుకు ప్రజలంటే విశ్వాసం లేదని, కార్యకర్తలు, నాయకులంటే గౌరవం లేదన్నారు.
ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచార సభలో తుమ్మల కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తుమ్మల ఓడించినందుకు టీఆర్ఎస్ కార్యకర్తలను పిచ్చి కుక్కలు కూడా ముట్టవని అసభ్య పదజాలంతో దూషించారని గుర్తు చేశారు. తుమ్మల తన వైఖరి, నోటి దురుసు తనంతోనే ఓడిపోయారని పేర్కొన్నారు. నాయకులుగానీ, కార్యకర్తలు గానీ ఆయన ఓటమి కోసం పని చేయలేదని టీఆర్ఎస్ గెలుపు కోసమే పని చేశామని అన్నారు. పార్టీ అనుమతి లేకుండా నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఇతర మండలాల నుంచి ప్రజలను సమీకరించి ప్రదర్శనలు నిర్వహించి ఇక్కడే కార్యకర్తలను అయోమయంలోకి పడేస్తున్నారని ఆరోపించారు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడికి, కార్యకర్తకి ఒక్క వర్క్ ఇచ్చారా..? అని ప్రశ్నించారు.
also read:-అసెంబ్లీలో అవి వాడోద్దంటా..? తెల్చిచెప్పిన స్పీకర్
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, తన బినామిలకు ప్రాథన్యతనిచ్చి పాలేరు నియోజకవర్గ నాయకులను విస్మరించేవాడని తెలిపారు. కార్యకర్తలను, నాయకుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని, అందుకే ఆయనంటే ప్రజలకు విరక్తికల్గిందన్నారు. సీఎం కేసీఆర్ అందించిన బడ్జెట్ తో పనులు చేసి నేను చేసిన, నేను చేసిన అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ముమ్మాటికి ఇతర ప్రాంత నివాసేనని, కందాళ ఉపేందర్ రెడ్డి స్థానికుడని స్పష్టం చేశారు.
also read :-ఖమ్మం రూరల్ కచ్చిరుముంగట మస్తు లొల్లి..
కందాళ ఉపేందర్ రెడ్డి వల్ల స్థానిక నాయకులకు గౌరవం పెరిగిందని, కులాలకు, మతాలకు అతీతంగా ఆయన అందర్ని సమానంగా ప్రేమిస్తున్నారని, అందరికి ఒకే రకమైన గౌరవం ఇస్తారని తెలిపారు. ఆయన చాలా సున్నితమైన వ్యక్తుత్వం కలవాడని, సేవకుడు, సహాయకుడని కొనియాడారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు చనిపోతే ఏ ఒక్కరోజైనా పరామర్శించారా..? కనీసం పదిరూపాయల సహాయం చేశారా..? అని ప్రశ్నించారు. కానీ కందాళ ఉపేందర్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున అందజేస్తున్నారని, అడిగిన వారందరకి కాదనకుండా సహాయం చేసే సద్గున దాణమూర్తి కందాళ అని కొనియాడారు.
అలాంటి నాయకుడిపై పోటీ చేస్తే కచ్చితంగా ఓటమితథ్యమని జోస్యం చెప్పారు. పాలేరు నియోజకవర్గప్రజలు పార్టీ ద్రోహులను నమ్మలేరని అన్నారు. ఇప్పటికైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ అనుమతి లేకుండా టీఆర్ఎస్ నాయకుడిగా పాలేరు నియోజవర్గంలో తిరగకూడాదని, నచ్చకపోతే బయటకు వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ జడ్పీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం గ్రామీణ, తిరుమలాయపాలెం మండల ఎంపీపీలు బానోతు శ్రీనివాస్, రమ్య, ఉమ, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు