Telugu News

టీడీపీ మెడకు పెగాసస్ ఉచ్చు

విజయం న్యూస్

0

టీడీపీ మెడకు పెగాసస్ ఉచ్చు

(విజయం న్యూస్):-

వివాదాస్పద సాఫ్ట్ వేర్ పెగాసస్ ఉచ్చు టీడీపీ మెడకు బిగుసుకునేలా కనిపిస్తోంది. అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారని, పెగాసస్ కొనుగోలు వ్యవహారం చంద్రబాబు కుమారుడు, నాటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. దీంతో యెల్లో శిబిరంలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ పెగాసస్ వ్యవహారంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని, మమతాబెనర్జీ అవగాహన రాహిత్యంతోనే పెగాసస్ ఆరోపణలు చేశారని లోకేష్ మీడియాకు చెప్పుకొచ్చారు.

also read;-జీళ్ళచెరువు హైస్కూల్ హెచ్ఎం సస్పెండ్

అయితే, పెగాసస్ కొనుగోలు కోసం సదరు స్పైవేర్ కు సంబంధించిన సంస్థ ప్రతినిధులు అప్పట్లో తమను సంపాదించిన మాట వాస్తవమేనని లోకేష్ ఒప్పుకున్నారు. వివాదాస్పద నిఘా సాఫ్ట్ వేర్ ను తాము కొనుగోలు చేసినట్లయితే ఎన్నికల్లో తాము ఓడిపోయేవాళ్లం కాదని నారా లోకేష్ వ్యాఖ్యానించడం విశేషం. స్పైవేర్ కొనుగోలు ఆరోపణలు బయటకు రావడం, అది కూడా దేశంలోని అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరైన మమతాబెనర్జీ సదరు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. పెగాసస్ వ్యవహారంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

ఇంతకీ ఏమిటీ పెగాసస్?

ఇజ్రాయెల్ దేశానికి చెందిన సైబర్ ఆయుధ తయారీ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందనే ఆరోపణలతో పెగాసస్ పై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగింది. మనదేశంలో సైతం పెగాసస్ రాజకీయ ప్రకంపనలను సృష్టించైనా సంగతి తెలిసిందే. పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశంలోని 300 మంది ప్రముఖులపై చట్టవ్యతిరేక నిఘా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీలు ఆరోపించాయి. పెగాసస్ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ అంశంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. సదరు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది