Telugu News

పట్టాలతో పేదలకు శాశ్వత ఉపశమనం .. మంత్రి పువ్వాడ.

◆ ఏళ్ళ కల నెరవేరింది..

0

పట్టాలతో పేదలకు శాశ్వత ఉపశమనం .. మంత్రి పువ్వాడ.
◆ ఏళ్ళ కల నెరవేరింది..
◆ 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్ లో 88పట్టాల పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
మునుపేన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేదల సంక్షేమం ప్రతి పేద వాడికి అందిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ళ పట్టల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 20వ డివిజన్ రామచంద్రయ్య నాగర్ లో ఏళ్ళ క్రితం ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు వేసుకున్న 88 మంది పేదలకు శాశ్వత ఇళ్ళ పట్టాలను మంత్రి పువ్వాడ పంపిణి చేశారు. గూడు లేని వారు ఎన్నోఏండ్ల నుండి అభద్రతా భావంతో రామచంద్రయ్య నగర్ నిర్వాసితుల సుదీర్ఘ కల నెరవేరిందన్నారు. ఇక్కడ నివసిస్తున్న పేదప్రజలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేసే అవకాశం నాకు కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు.

also read :-రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.

20ఏళ్ళ క్రితం నా సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ చొరవతో ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న పేదలకు నా చేతుల మీదగా తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుందని ఊహించలేదన్నారు. పేదవాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఏ హక్కు లేకుండా జీవించడం కొంత బాధ కలిగించిందని అన్నారు. నేను మంత్రిగా ఉండటం వల్లే నేడు దాదాపు 2వేలకు పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగామన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి సభా వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.

also read :-నేడు జిల్లాలో ఇధ్దరు మంత్రుల పర్యటన

ఖమ్మం నగరంలో గుడిసెలు వేసుకుని నివాసముండి పట్టాలు లేని పేదవాళ్ళు సొంత ఇల్లు లేకుండా వుండటానికి వీలు లేదని అన్నారు.నేడు పట్టాలు ఇవ్వటమే కాదు…జీవో. నెం. 58, 59లో నమోదు చేయించి హాక్కు ఇస్తామన్నారు. రాబోవు కాలంలో పట్టానే కాదు సొంత స్థలం ఉన్న వారికి ప్రభుత్వం తరుపున రూ 5 లక్షలు ఇచ్చి సొంత ఇల్లు కట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం.. అభివృద్ధిలో ఖమ్మాన్ని చూసి రాష్ట్రం అంతా ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకెళతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు మెడా ప్రశాంత లక్ష్మి, షౌకత్ అలీ, దొరేపల్లి శ్వేత, మక్బూల్, కమర్తపు మురళీ, కొత్తపల్లి నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, తహసిల్దార్ శైలజ, జ్యోతిరెడ్డి, నగర అద్యక్షుడు పగడాల నాగరాజు, డివిజన్ నాయకులు గుత్తా వేంకటేశ్వర్లు, తాజుద్దీన్, ఇసాక్, బిక్కసాని దామోదర్, ముక్తార్, ప్రసన్న కృష్ణ తదితరులు ఉన్నారు.