డిజిటల్ గ్రీన్ ఎన్జీవో సంస్థ యాఫ్ తో చీడపీడల నివారణ
(కూసుమంచి-విజయం న్యూస్)
కూసుమంచి మండలం లోని కూసుమంచి రైతు వేదిక లో డిజిటల్ గ్రీన్ ఎన్జీవో సంస్థ ద్వారా రిసోర్స్ పర్సన్స్ ను ఎంపిక చేయడం జరిగింది. సి ఆర్ పి లు మిర్చి పంటను ఆశించే చీడపీడల నివారణ గురించి డిజిటల్ గ్రీన్ ఎన్జీవో వారు రూపొందించిన యాప్ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం అందజేస్తారని మండల వ్యవసాయ అధికారి ఆర్. వాణి, మండల ఉద్యానవనశాఖ అధికారి నగేష్ అన్నారు. మిరప పంట వివరాలను ఆన్లైన్ యాప్ లో నమోదు చేయడం కోసం డిజిటల్ గ్రీన్ ఎన్జీవో ఆధ్వర్యంలో మండల పరిధిలోని కూసుమంచి రైతు వేదిక నందు సి ఆర్ పి ల నియామకం చేపట్టారు.
also read;-భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం
కూసుమంచి మండలం లోని కూసుమంచి గట్టు సింగారం ,పోచారం , పాలేరు, జీళ్ళ చెరువు చేగోమ్మ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, ఆయా గ్రామాల్లో ప్రతి 200 ఎకరాలకు ఒక సి ఆర్ పి ని నియమిస్తారని, సి ఆర్ పి లు రైతులు సాగు చేసిన పంటలను పరిశీలించి వాటి వివరాలను ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చేస్తారని వివరించారు. భూసార పరీక్షలు నిర్వహించడం ,తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు మిర్చి నాణ్యతను పరిశీలించడం ,పంటకు ధర ఎక్కడ ఎక్కువగా ఉందని సమాచారాన్ని యాప్ ద్వారా రైతులకు అందజేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిజిటల్ గ్రీన్ ఎన్జీఓ జిల్లా మేనేజర్ యశోద ,వెంకట్, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొనడం జరిగింది.