Telugu News

కాంగ్రెస్ కు పికె హ్యండ్

డిల్లీ విజయం న్యూస్

0

కాంగ్రెస్ కు పికె హ్యండ్

(డిల్లీ విజయం న్యూస్ ):-

కాంగ్రెస్‌లో చేరేందుకు జాతీయ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ నిరాకరించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ మంగళవారం అధికారికంగా ధృవీకరించింది. కాంగ్రెస్ లొ చేరుతున్నారు…టి.అర్.ఎస్ కాంగ్రెస్ దోస్తి..అంటు వార్తలు హల్ చల్ చేసాయి. అంతేగాకుండా కాంగ్రెస్‌‌ పార్టీలో చేరేందుకు పీకే ఇప్పటికే ఆ పార్టీ చీఫ్‌‌ సోనియాగాంధీ, ముఖ్య నేత రాహుల్‌‌ గాంధీతో పలుమార్లు భేటీ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్‌‌లోకి ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగుతుండగా..

also read :-టీఆర్ఎస్ ప్లీన‌రీని విజయవంతం చేయండి

ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా షాక్‌కు గురయ్యారు. అంతేగాకుండా , తాను కాంగ్రెస్‌లో చేరడం లేదని స్వయంగా పీకే కూడా ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.దీంతో సస్పెన్స్ కు తెరపడింది.కాగా ఇటు టి.ఆర్.ఎస్ కార్యకర్తలు హుషారుగా ఉండగా…కాంగ్రెస్ కార్యకర్తలు షాక్ కు గురి అయ్యారు. వేచి చూద్దాం, ఏం జరుగుతుందో