Telugu News

★ ఖమ్మం పారిశుధ్యం, వ్యర్థ నిర్వహణ భేష్

** ఆహ్లాదంగా ఖమ్మం నగరం పునర్నిర్మాణం

0

★ ఖమ్మం పారిశుధ్యం, వ్యర్థ నిర్వహణ భేష్

** ఆహ్లాదంగా ఖమ్మం నగరం పునర్నిర్మాణం

మంత్రి అజయ్ కృషికి ప్రతి ఫలాలు
★ పారిశుధ్యం, వ్యర్థ నిర్వహణకే అధిక ప్రాధాన్యం
– మంత్రి శ్రీ అజయ్ కుమార్

ఖమ్మం నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది అంటూ గతంలో దినపత్రికల్లో సంపాదకీయాలు ప్రచురించన రోజంటు లేకపోలేదు. ఆనాటి దుర్భర పరిస్థితులు ఎన్నో, పారిశుధ్యం సరిగా అమలు కాక చాలీచాలని సిబ్బంది, వాహనాల కొరతతో చెత్త సేకరణ సక్రమంగా సాగక ఇళ్ల మధ్య చెత్త పేరుకుపోతూ నగర వాసులు వ్యాధులు బారిన పడిన రోజులు నుంచి అహ్లాధమైన వాతావరణం లో సుందరమైన సరస్సులు మధ్య జీవనం సాగిస్తున్న పరిస్థితులను నేటి రోజుల్లో చూస్తున్నాము.

also read;-*మహిళా గవర్నర్ కు గుర్తింపు లేని రాష్టంలో మహిళా బంధా..?: సౌజన్య

ఒక నాడు విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో అధ్వాన పరిస్థితులు వారం, రెండు వారాలకోసారి మురుగునీటి కాలువల శుద్ధి, రెండు, మూడు రోజుకోసారి చెత్త తరలింపు, డంపింగ్‌యార్డు సమస్యలు, రహదారులపై, వీధుల్లో దుకాణాలు, హోటళ్ల వ్యర్థాలు ఇదీ పరిస్థితి అలాంటి దుర్భరం స్థితి ఖమ్మం పట్టణంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఫలితంగా మటుమాయమైంది. పరిశుభ్రతపై పట్టణ ప్రగతిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు.

also read;-ఖమ్మంకు మెడికల్ కళాశాల మంజూరు పట్ల మమత వైద్య విద్యార్థుల సంబరాలు..

నగర పాలక సంస్థ అధ్వర్యంలో వ్యర్థాల సేకరణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్, ఎరువుల తయారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఆధునిక సాంకేతిక సహకారంతో నివేదికలు రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ​ నిధులతోపాటు, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ప్రాజెక్టులు సిద్ధం చేస్తోంది. కసరత్తు ప్రారంభించింది. ఇళ్ల నుంచి చెత్త సేకరణ, తరలింపుతో పాటు పారబోత వంటి అంశాలతో సమగ్ర విధానాన్ని రూపొందించారు. ఇప్పటికే డంపింగ్ యార్డ్​, వ్యర్థాల సేకరణ కేంద్రాలు, శుద్దీకరణ కేంద్రం ఏర్పాటు చేశారు.

పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ లో ఆదర్శం

ప్రతి రోజూ తడి, పొడి చెత్తను సేకరించి ఆటోల ద్వారా డంపింగ్‌ యార్డ్‌కు మున్సిపల్ కార్మికులు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఈ ఎరువును నాటిన మొక్కలతో పాటు పొలాల్లో కావలసిన రైతులకు అందిసున్నారు. రోడ్లపై చెత్తాచెదారం లేకుండా సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. పట్టణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. రూ.5.48 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెం డంపింగ్‌ యార్డు వద్ద ‘మానవ విసర్జితాల శుద్ధీకరణ’ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎఫ్‌ఎస్‌టీపీ కేంద్రంలో అనారోబిక్‌ సేఫ్టీలైజేషన్‌ రియాక్టర్‌లో విసర్జితాలను మెథనైజేషన్‌ పద్ధతిలో శుద్ధి చేసి విసర్జితం, నీటిని వేరు చేస్తారు. నీటిని పాలిషింగ్‌ ఫండ్‌లో పాస్పరేట్, సల్ఫర్‌ ద్వారా శుద్ధిచేసి ప్యూరిఫైడ్‌ వాటర్‌గా మార్చుతారు. 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది అనంతరం ఆ నీటిని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం మొక్కలు కొరకు వినియోగించనున్నారు

నగర పాలకసంస్థ అవగాహన కార్యక్రమాలు

నగర పాలక సంస్థ అధ్వర్యంలో నగరంలో వివిధ అంశాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ పోటీలు, ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యాలయాల్లో విద్యార్థులకు స్వచ్ఛతపై పోటీలు, పరిసరాల పరిశుభ్రతపై యూత్‌ కమిటీలు, మహిళా సంఘాలతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. స్వచ్ఛత విషయంలో వ్యాసరచన పోటీలు, పోస్టర్లు, క్లీన్‌ వార్డులు తదితర అంశాల్లో పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం కోసం కృషి చేసిన వారిని గుర్తించి ప్రోత్సాహకం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆయా విభాగాల్లో పోటీలు ఏర్పాట్లు చేశారు. బెస్ట్‌ హోమ్‌ కంపోస్టు, హోటళ్లు, దవాఖానలు, విద్యా సంస్థలు, స్వశక్తి సంఘాలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, జవాన్‌, ఎన్‌జీవో, మహిళా సంఘాల సీవోలు, ఆర్‌పీలను గుర్తించి ప్రోత్సాహకాలను అందిస్తున్నారు.

★ పారిశుధ్యం, వ్యర్థ నిర్వహణకు అధిక ప్రాధాన్యం

★ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణలోని మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 8,900 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి, ఇంటి మురుగునీటి కంటే సేప్టేజ్ చాలా కలుషితమైనందున ఆ వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయడంపై దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. మల బురద మరియు సెప్టేజీ నిర్వహణ ద్వారా అంతరాయం కలిగించే, సురక్షితమైన పారిశుద్ధ్య పరిష్కారం యొక్క అవసరాన్ని గుర్తించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సమగ్ర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేని పట్టణాలు మరియు మునిసిపాలిటీలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ మోడల్ నాణ్యమైన కార్యకలాపాలు మరియు నిర్వహణను నిర్ధారిస్తుందన్నారు. నీతి ఆయోగ్ సైతం తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు సిఫార్సు చేసిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.