పోడు భూముల పంచాయతీ ఇంకేన్నాళ్లు
== పోడు రైతులకు సీఎం ఇచ్చిన మాటేమైంది
== వైఎస్ఆర్ ఉండుంటే పోడు రైతుల కండ్లలో ఆనందం చూసేవాళ్లం
== ఇంద్రవెల్లి ఘటనకు 42ఏళ్లు..అమరులైన అదివాసులందరికి నివాళ్లు
== పాలకపక్షం ప్రజల పాలన మర్చిపోయారు
== పాదయాత్రలో ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ షర్మిళ
== కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్ర
(భద్రాద్రికొత్తగూడెం బ్యూరో-విజయంన్యూస్)
పోడుభూముల పంచాయతీ ఇంకేన్నాళ్లు కొనసాగిస్తారో తెలంగాణ ప్రభుత్వం అర్థం కావడం లేదని, పోడు రైతులకు మాటిచ్చిన సీఎం కేసీఆర్ ఆ మాట తప్పి, పోడు రైతులను ఇంకా మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఆరోపించారు. మహా ప్‌తజాప్రస్థానంలో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం కారకవాగు గ్రామంలో రైతు గోస ధర్నాలో పాల్గొన్నారు. స్థానిక రైతులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలు వైయస్ షర్మిల చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మాట్లాడారు. .
also read :-రైతు రాజ్యం కోసమే రాహుల్ సభ
ఇంద్రవెల్లి ఘటన జరిగి నేటికి 42 ఏళ్లు అయ్యిందని, ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన ఆదివాసీలందరికీ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నివాళులు అర్పిస్తోందని అన్నారు. కొమురం భీమ్ స్ఫూర్తితో ఆదివాసీలు చేసిన పోడు భూముల పోరాటంలో వందల మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు రాజకీయాల కోసం పోడు రైతులను నిలువున మోసం చేస్తున్నారని ఆరోపించారు. వందల ఏళ్లుగా పోడు భూముల కోసం పోరాటం జరుగుతూనే ఉందని, నేటికి ఆ పంచాయతీ కొనసాగుతూనే ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క ఎకరా పోడు భూమికి పట్టా ఇచ్చింది లేదని, కానీ వైయస్ఆర్ బతికుంటే రైతులకు పోడు పట్టాలు అంది ఉండేవని అన్నారు. వందల ఏళ్లుగా పోడు భూముల కోసం పోరాటం జరుగుతూనే ఉంది. జల్, జంగల్, జమీన్ అని మొదలైన పోరాటం ఈ రోజు వరకు కూడా జరుగుతుందని అన్నారు. ఆదివాసీలను అరెస్టు చేసి కేసులు పెడుతూనే ఉన్నారని, కేసీఆర్ పాలనలో ఇదే ఖమ్మం జిల్లాలో 21 మంది మహిళలను లాఠీలతో కొట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు. కాళ్ళు పట్టుకుంటే తప్ప మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని, ఇదేనా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మర్యాద అని అన్నారు.
also read :-ఎస్ఐ దారం సురేష్ నీ సన్మానించిన 1104 బిటిపిఎస్ రీజినల్ ప్రెసిడెంట్ భూక్య హెంలాల్ నాయక్
వైయస్ఆర్ మాత్రమే పోడు భూముల సమస్యలను పరిష్కరించేవారని గుర్తు చేశారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే వైయస్ఆర్ లక్షా 90 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని, వైయస్ఆర్ బ్రతికి ఉంటే మిగతా భూములకు పట్టాలు వచ్చేవని తెలిపారు. వైయస్ఆర్ తర్వాత పోడు భూముల సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని, ఏ పాలకులు ఒక్క ఎకరాలకు కూడ పట్టా ఇవ్వలేదని అన్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ పోడు భూముల సమస్య కుర్చీ వేసుకొని కూర్చొని పరిష్కరిస్తామన్నారని, ఇంతవరకు కేసీఆర్ ఎందుకు పరిష్కరించలేకపోయారో పోడు రైతులకు సమాధానం ఇవ్వాలని సూచించారు. లేకపోతే సీఎం కేసీఆర్ నే నేరుగా రైతులు ప్రశ్నించాలని సూచించారు. కేసీఆర్‌కు పోడు భూముల సమస్యపై చిత్తశుద్ది లేదని అన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఏ సమస్యలు లేవని భావిస్తున్నారని, కేసీఆర్ మత్తులో పూటకో మాట మాట్లాడుతాడని ఆరోపించారు. ఒకసారి వడ్లు కొనం అంటాడు, మళ్ళీ రాజకీయాల కోసం నేనే కొంటా అంటాడని దుయ్యబట్టారు. మిర్చికి నష్ట పరిహారం ఇస్తామంటాడు, మరిచిపోతాడని యద్దేవా చేశారు.
also read “:-తమ్ముడు సమాధిపై గులాబీలు చేరకముందే అన్నకు అంత్యక్రియలు.
ఇలా పూటకో మాట మార్చే కేసీఆర్ మాట అసలు నమ్మొచ్చా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక తప్పుడు సంతకం వల్ల కేంద్రం మన వడ్లు కొనను అని చెప్పిందని, కేసీఆర్ వడ్లు వేసుకోవద్దని చెప్పినందుకు ఇదే భద్రాద్రి జిల్లాలో శంకర్ నాయక్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. వడ్ల కొనుగోలు పై ఢిల్లీకి వెళ్లి పోరాడుతానని చెప్పి కేసీఆర్ చేతులు ఊపుకుంటూ ఖాళీగా వచ్చాడని ఆరోపించారు. కేసీఆర్ చేసిన తప్పు వల్ల 17 లక్షల ఎకరాల్లో రైతుల వరి వేయకుండా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని, కేసీఆర్ కి వడ్లు కొనాలని ఉద్యేశ్యం లేదని తెల్చి చెప్పారు.
వడ్లు కొంటాను అని చెప్పి 500 వందల కొనుగోలు కేంద్రాలు తెరిచారు, అందులో 30 కేంద్రాల దగ్గరే వడ్లు కొంటున్నారని ఆరోపించారు. మిగతా కొనుగోలు కేంద్రాలు తెరిచిన పాపాన పోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో గెలిచి కేసీఆర్ కు అమ్ముడుపోయాడు. ఎమ్మెల్యే , అతని కొడుకు దుర్మార్గాలపై కేసీఆర్ ఏనాడైనా ఇటు తిరిగి చూశాడా? అని ప్రశ్నించారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడం కోసం పని చేయాలి కానీ అధికార పార్టీ రక్షణ కోసం పోలీసులను పనోళ్లుగా పెట్టుకున్నారని ఆరోపించారు. పాలక పక్షం ప్రజలను గాలికి వదిలేసింది. ఏ ఒక్క నాడు ప్రజా సమస్యలపై పోరాడలేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. ప్రజల కోసం పోరాడేందుకే వైయస్ఆర్ పేరు మీద వైయస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించామని, పార్టీలో, పార్టీ జెండాలో వైయస్ఆర్ ఉన్నారని అన్నారు. మళ్లీ ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ (సువర్ణ) పాలన అందించడమే మా లక్ష్యమన్నారు.
== ఎమ్మెల్యే కొడుకు దరిద్రుడు
కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేంద్ర చాలా దరిద్రుడని, మానపానాలను కోరుకుంటున్న వ్యక్తిని ఈ సమాజం ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. కొత్తగూడెం నియోజక వర్గం పాల్వంచ మండలం సూరారం గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట – ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న షర్మిళ మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో పరిపాలన ఎలా ఉందో అందరు చూశారని, వైఎస్సార్ సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించారని అన్నారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ లా ఉండాలని, అందరికి ఆదర్శవంతమైన నాయకుడు ఆయనేనని అన్నారు. అందుకే ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నాడో అర్థం కావడం లేదన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మోసం చేయని వర్గం అంటూ లేదన్నారు. ఒక్కరైనా మేము బాగుపడ్డం అని చెప్పుకొనే స్థితిలో ఉన్నారా..? కేసీఆర్ ,ఆయన కుటుంబం తప్పా ఎవరైనా బాగుపడ్డారా..? అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కొడుకు ఒక దరిద్రుడని, ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడో అర్థమవుతుందన్నారు.
also read :-మేడారం రైతులను మర్చిపోయిన మంత్రి జడ్పీ ఛైర్మెన్
తప్పులమీద తప్పులు చేసినోల్లు దర్జాగా రోడ్డు మీద తిరుగుతున్నారని, పోలీస్ లు వాళ్లకు పనోళ్లు లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నికలు వేస్తే స్విచ్ వేసినట్లు పథకాలు వస్తాయని, దొంగ పథకాలు..దొంగ హామీలు తర్వాత అంతా ప్యాకప్ అని అన్నారు. ఎన్నికల తర్వాత వాళ్ళే ధనవంతులు అవుతారన,ప్రజలు మరింత బీదొల్లు అవుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండి ఎం లాభం. అధికార పార్టీ కి ఎమ్మెల్యే లను సప్లయ్ చేసే పార్టీ అని యద్దేవా చేశారు. బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేకపోయిందని, పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతుంది బీజేపీ ప్రభుత్వం టీఆరెఎస్,బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు అన్ని కూడా ప్రజలను మోసం చేశాయని అన్నారు. రైతుల రక్తాన్ని పిండుతున్నాయని అన్నారు. వనమా రాఘవేంద్రాను ఎందుకు వదిలేస్తున్నారో చెప్పాలన్నారు.