పోడు రైతులకు పట్టాలేప్పుడిస్తారు..?
== ఏజెన్సీ ప్రజలను తెలంగాణ ప్రభుత్వం వదిలేసింది
== అదివాసులు ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తున్నరు
== రాజన్న అదివాసులకు 11లక్షల ఎకరాలకు పట్టాలిచ్చారు
== కేసీఆర్ 2లక్షల ఎకరాలను గుంజుకున్నరు
== దళితబంధు పేరుతో కొత్త నాటకం మొదలెట్టిండ్రూ
== పాదయాత్రలో ప్రభుత్వంపై విరుచకబడ్డా వైఎస్ షర్మిళ
== ఇల్లందు నియోకజవర్గంలో 57వ రోజు కొనసాగిన పాదయాత్ర
(ఇల్లందు-విజయంన్యూస్)
ప్రభుత్వం వచ్చిన తరువాత కుర్చివేసుకుని కుర్చోని పోడు రైతులకు పట్టాలిస్తానని లక్షలాధి మందిజనం ముంగిట మాటిచ్చిన సీఎం కేసీఆర్, 8ఏళ్ల తెలంగాణ పరిపాలనలో ఎంత మంది పోడు రైతులకు పట్టాలిచ్చారని వైఎస్ షర్మిళ ప్రశ్నంచారు. ప్రజాప్రస్థానంలో భాగంగా 57వ రోజు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం గోలియాతండాలో పాదయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత టేకులపల్లి మండలకేంద్రంలో ‘రైతు గోస’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ.. ఏజెన్సీ ఏరియాలను కేసీఆర్ పట్టించుకోవవడం లేదని, తెలంగాణలో, దేశంలో ఒక భాగంగానైనా గుర్తించడం లేదన్నారు.
also read;-అధికార పార్టీకి తొత్తుగా మారిన పోలీసు వ్యవస్థ
ఏజెన్సీ సమస్యల పరిష్కారంపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు. తాతముత్తాతల నుంచి సాగుచేసుకుంటున్న పోడు భూములకు సైతం పట్టాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పోడు పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములను కేసీఆర్ లాక్కుంటున్నారని పేర్కొన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలపై దాడులు చేయించి, జైలుపాలు జేస్తున్నారని తెలిపారు. మహిళలు, చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా లాఠీలతో కొట్టి, జైలులోపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో కనీసం మంచినీళ్లు, తినడానికి తిండి కూడా పెట్టడం లేదన్నారు. వైయస్ఆర్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 11లక్షల పోడు భూములను గుర్తించి, ఆయా భూములకు పట్టాలు ఇవ్వాలని సంకల్పించారన్నారు.
తొలి విడతగా 3.3లక్షల ఎకరాలను పట్టాలు ఇచ్చారని, ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.20లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు వైయస్ఆర్ గారు మరణించారని, ఆ తర్వాత వచ్చిన వచ్చిన ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పట్టాలివ్వలేదన్నారు. పోడు భూముల్ని సర్కార్ స్వాధీనం చేసుకోవడంతో రైతులు చాలామంది పనిలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు తోడు అసైన్డ్ భూములకు సైతం కేసీఆర్ ఎసరు పెడుతున్నాడని విమర్శించారు. ఎన్నికల ముందు మంత్రులతో, అధికారులతో వచ్చి కుర్చీ వేసుకుని పోడు భూములకు పట్టాలిస్తానన్న కేసీఆర్.. గెలిచాక పత్తా లేకుండా పోయాడని తెలిపారు.
also read;-రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు
దళితులకు అడుగడుగునా మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని, దళిత ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతాడరన్నారు. ముందు దళిత ముఖ్యమంత్రి అని ఆ తర్వాత దళితులకు మూడెకరాల భూమి అని మోసం చేశాడన్నారు. ఇప్పుడు దళితబంధు పేరుతో కొత్తనాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. దళితులకు మూడెకరాలు, వాటి సాగుకు ఏటా ఎకరాకు రూ.లక్ష, దళితబంధు రూ.10లక్షలతో కలుపుకొని దళితులకు మొత్తం రూ.61లక్షలు బాకీ ఉన్నాడని తెలిపారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేదని స్పష్టం చేశారు. రైతులకు కేసీఆర్ శాపంగా మారారని, రైతుల్ని నట్టేట ముంచాడని తెలిపారు. రైతుకు ఎకరాకు రూ.5వేలు ఇచ్చి, రూ.25వేల విలువైన పథకాలు బంద్ పెట్టాడని తెలియజేశారు. రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ, రాయితీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పంట నష్టపరిహారం ఇవన్నీ కేసీఆర్ బంద్ పెట్టారని పేర్కొన్నారు.
ఇక కౌలు రైతులు గాలికి వదిలేశారని, మనుషులుగానైనా కేసీఆర్ గుర్తించడం లేదన్నారు. రైతులంతా కేసీఆర్ నియంత పాలనను తరిమికొట్టి వైయస్ఆర్ సంక్షేమ పాలనకు పట్టం కట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు భూములకు పట్టాలిస్తామని, రైతులు, రైతు కూలీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఓటు అనేది ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం. దానితోనే కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికే YSR తెలంగాణ పార్టీ పెట్టామన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామన్నారు. పోడు పట్టాల పంపిణీతో పాటు వ్యవసాయాన్ని పండుగ చేస్తామన్నారు.
also read;-గుర్తుతెలియని వాహనం ఢీ కోని యువకుడు మృతి …
ఆరోగ్యశ్రీని బ్రహ్మాండం చేస్తామని, మహిళలకు రుణాలు పంపిణీ చేసి, ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. పేద వాళ్లకు ఇండ్లు నిర్మించి, మహిళల పేర్ల మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యంతో పాటు మన పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇంట్లో ఉన్న అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగ యువతకు అండగా నిలబడతామన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ల లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తామన్నారు. రైతులతో పాటు కౌలు రైతులకూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.