Telugu News

పలు కుటుంబాలకు టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ పరామర్శ

తల్లాడ-విజయం న్యూస్

0

***పలు కుటుంబాలకు టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ పరామర్శ
***(తల్లాడ-విజయం న్యూస్);-
సోమవారం నాడు తల్లాడ మండలం లో పర్యటించిన టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ముందుగా తల్లాడ లో దారా విష్ణు మోహన్ రావు మాతృమూర్తి దారా సుబ్బమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎంపీ నామ పరామర్శించారు అలానే మండలం లోని వెంకటగిరి గ్రామంలో దిరిశాల నాగేశ్వరరావు, నరసింహారావు తండ్రి దిరిశాల బసవయ్య ఇటీవల మరణించగా వారి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన ఎంపీ నామ నాగేశ్వరరావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

also read :–==కూసుమంచి పీఎస్ ఎదుట మహిళ ఆందోళన

ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మండల ఎంపీపీ దొడ్డ.శ్రీనివాసరావు, టి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డం.వీరమోహన్ రెడ్డి,రైతు బంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర. వెంకటలాల్, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి.భద్రరాజు,సర్పంచుల సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారపోగు. వెంకట్,టి.ఆర్.ఎస్ జోన్ అధ్యక్షుడులు బద్దం.కోటిరెడ్డి,కేతినేని. చలపతిరావు, టి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు జి.వి.ఆర్,టి.ఆర్.ఎస్ ఉద్యమ నాయకులు బొడ్డు. వెంకటేశ్వరరావు,రైతు స.సమితి అధ్యక్షుడు గుండ్ల.నాగయ్య,సత్తుపల్లి నియోజకవర్గ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కోడూరి.వీరకృష్ణ, లయన్స్ క్లబ్ మెంబర్ దార.శ్రీను,టి.ఆర్.ఎస్ నాయకులు మరేళ్ల.దేవందర్,టి.ఆర్.ఎస్ మండల ఉపదక్షుడు దొడ్డ.చిన్న శ్రీను,ఉపసర్పంచ్ నరేష్,టి.ఆర్.ఎస్ నాయకులు కొల్లిపాక.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

also read :-**నాగార్జున సాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా బి.చంద్రశేఖర్
== తాళ్లూరి పంచాక్షరయ్య కుటుంబ సభ్యులకు ఎంపీ నామ పరామర్శ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, ఇరవెండి గ్రామానికి చెందిన ప్రముఖులు తాళ్లూరి పంచాక్షరయ్య సతీమణి మరియు అమెరికా తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ గారి మాతృమూర్తి తాళ్లూరి భారతిదేవి మృతి పట్ల టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు.. సోమవారం నాడు ఉదయం గ్రామంలో పంచాక్షరయ్య నివాసానికి వెళ్లిన ఎంపీ నామ భారతిదేవి పార్దివ దేహానికి పూలు వేసి నివాళులర్పించారు..అనంతరం పంచాక్షరయ్య తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, రైతు బంధు ఖమ్మం జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, లగడపాటి రమేష్ ,చిత్తారు సింహాద్రి యాదవ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు