Telugu News

జిల్లాలో ఎంపీ నామ సుడిగాలి పర్యటన

పలు శుభకార్యాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు

0

జిల్లాలో ఎంపీ నామ సుడిగాలి పర్యటన

పలు శుభకార్యాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు

ఖమ్మం
శనివారం ఖమ్మం కార్పొరేషన్ తో పాటుగా కారేపల్లి మండలం లో జరిగిన పలు వివాహ శుభకార్యాలు, ప్రారంభోత్సవాల్లో TRS లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. అందులో భాగంగా ముందుగా చల్లపల్లి గార్డెన్స్ లో జరిగిన ఏలూరి శ్రీనివాసరావు గారి కుమార్తె వివాహానికి, ఖమ్మం రూరల్ వెంకటగిరి గ్రామంలో జరిగిన పెద్దప్రోలు వెంకటేశ్వర్లు ,సుగుణ గార్ల కుమారుని వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఖమ్మం మామిళ్ళగూడెం లోని వీవీసీ ఫంక్షన్ హాల్ లో జరిగిన సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాదరావు కుమారుని వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

also read :-క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

అనంతరం ఖమ్మం నగరంలో బాలాజీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వాత్సల్య రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ను ఎంపీ నామ నాగేశ్వరరావుప్రారంభించారు..అక్కడ నుండి కొత్త లింగాల గ్రామంలో జాస్తి పల్లి రోడ్ లో ఉన్న ఫంక్షన్ హాల్ లో జరిగిన మేకల మల్లిబాబు యాదవ్ గా కుమార్తె వివాహానికి మరియు కారేపల్లి మండలం, చింతలపాడు గ్రామంలో మండల ఎంపీపీ మాళోతు శకుంతల  తమ్ముడి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గా, TRS రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి),భాగం హేమంత్ రావు  జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , మద్దినేని బేబీ స్వర్ణకుమారిమెళ్ళచేరువు వెంకటేశ్వరరావు బాణాల వెంకటేశ్వర్లు , చిత్తారు సింహాద్రి యాదవ్ , కారేపల్లి ఎంపీపీ శకుంతల కిషోర్, మండల పార్టీ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు కార్యదర్శి అజ్మీరా వీరన్న , ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ , నాయకులు బత్తుల శ్రీనివాసరావు , రైతు బంధు కన్వీనర్ గుగులోతు శ్రీను , వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు సర్పంచ్ స్రవంతి ,ఉప్పునూతల నాగేశ్వరరావు , సీనియర్ న్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు , ఇమ్మడి తిరుపతి రావు  వాంకుడొతు నరేష్  తదితరులు పాల్గొన్నారు