Telugu News

****ఉల్లాసంగా…! ఉత్సాహంగా…పొంగులేటి పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కొనసాగుతున్న పొంగులేటి పర్యటన

0

****ఉల్లాసంగా…! ఉత్సాహంగా…పొంగులేటి పర్యటన

****ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కొనసాగుతున్న పొంగులేటి పర్యటన
****కావాలి శీనన్న… రావాలి శీనన్న…. అంటూ అభిమానుల నినాదాలు
****గడప గడపకూ తిరుగుతూ ఆప్యాయ పలకరింపులతో ముందుకు సాగుతున్న పర్యటన
****ఆదివారం ఒక్కరోజే ఆరు నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో పర్యటన

****(ఖమ్మంవిజయం న్యూస్):-

ఖమ్మం: ఒకటి కాదు.. రెండు కాదు.. గడిచిన నెలరోజుల కాలంలో ఏకంగా ఇరవై రోజులకు పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన జోరుగా కొనసాగుతుంది. రోజుకు 400 కి.మీ. పైగా ఆలుపూ… సొలుపూ లేకుండా ఉ మ్మడి జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాలను చుడుతున్నారు. ఏ నియోజకవర్గ గ్రామంలో ఆయన అడుగుపెట్టినా ‘కావాలి శీనన్న’… ‘రావాలి శీనన్న’… అంటూ పెద్దఎత్తున ప్రజలు… కార్యకర్తలు… అభిమానులు నినాదాలు చేస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. వారు అందిస్తున్న జోష్ తో పొంగులేటి శీనన్న ‘తగ్గేదేలే’ అంటూ రెట్టించిన జోష్ తో గడప గడపకూ తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నా… మీ శీనన్నను అని హామీ ఇస్తూ ఉల్లాసంగా… ఉత్సాహంగా ఆయన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే ఆరు నియోజకవర్గాల్లోని బోనకల్, ఖమ్మం, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, కామేపల్లి, ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, చుంచుపల్లి, ఏన్కూరు, వైరా మండలాల్లో పర్యటించడం విశేషం.

also read :-తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. తునాతునకలైన మృతదేహాలు

బోనకల్: బోనకల్ మండలంలోని పెద్దబీరవల్లి, బోనకల్ గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలను కానుకగా అందించారు.

ఖమ్మం నగరంలోని మమతారోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రారంభించారు. అదేవిధంగా భక్తరామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి వేడుకకు విశిష్ట అతిథిగా హాజరైయ్యారు. పలు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఖమ్మం రూరల్:  మండలంలోని గుర్రాలపాడు, వెంకటగిరి, ఎం.వెంకటాయపాలెం, పెద్దతండా ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకల్లో తెరాస రాష్ట్ర నాయకులు, మాజీ ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఏదులాపురంలో జరిగిన సమియో అనే స్వచ్చంధ సంస్థ కార్యాలయంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ప్రారంభించారు. సుమారు 250మందికి పైగా రక్తదాతలు తమ రక్తాన్ని దానం చేశారు.

రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని జీకే. బంజర, రాంక్యా తండా ప్రాంతాల్లో జరిగిన పలు వివాహా వేడుకలకు తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన వస్త్రాలను కానుకగా అందించారు.

also read :-**దేశానికి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ‌ వేదిక అవ‌స‌రం : సీఎం కేసీఆర్

ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వెంట రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, జిల్లా టీఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్లు మలీదు జగన్, దొడ్డా నగేష్, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, కోసూరి శ్రీనివాసరావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఉమ్మినేని కృష్ణ, తమ్మారపు బ్రహ్మయ్య, బోనకల్ సర్పంచ్ భూక్య సైదా నాయక్, భీమనాధుల అశోక్ రెడ్డి, రాయల పుల్లయ్య, చింతమళ్ల గురుమూర్తి, కాంపాటి రమేష్, నాగార్జున్ రెడ్డి, తోట ప్రసాద్, అజ్మీరా అశోక్, ఉబ్బన శ్రీను, కానంగుల రాధాకృష్ణ, కాటేపల్లి కిరణ్, కొప్పెర ఉపేందర్, తంబి, ఆది, మెండే వెంకటేష్, కిషోర్ రెడ్డి, యువనేత గోపి, జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, రామాపురం సర్పంచ్ తొండ పు వేణు, గుడిపూడి రామకృష్ణ, కన్నీటి సురేష్, సాధినేని రాంబాబు, సండ్ర కిరణ్, తోటకూర వెంకటేశ్వరరావు, బోయినపల్లి మురళి, భాగం నాగేశ్వరరావు, కోయినేని ప్రదీప్, గొడుగు కృష్ణ, నల్లి బోయిన కృష్ణ, బీరెల్లి కృష్ణ, బండి వెంకటేశ్వర్లు, పరసగాని గోపి, ఆళ్ల మురళి, కొరివి సురేష్, దాసరి గణేష్, ఊటుకూరు బాలకృష్ణ, పులగం వెంకట కృష్ణ, పిట్టల నాగేశ్వరరావు, గంగదేవుల రామకృష్ణ, వెంకటేష్, గంగుల రాంబాబు, బూసి శ్రీను, వెంకటేశ్వర్లు, చంద్ర కృష్ణ, పులగం హనుమంతరావు, ఎస్ కె ఫకీర్, ఎస్ కె పాషా, రాములు నాయక్, గాలి కృష్ణ, బండి తిరుమలరావు, ఎస్ఆర్ఎ భాగం రాకేష్, మల్లాది లింగయ్య, సాన్ సాహెబ్, పార నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.