Telugu News

బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..

14 ఎకరాల్లో రూ.1.50 కోట్లతో నిర్మితం కానున్న అద్భుత వనం, మినీ ట్యాంక్ బండ్.

0

బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..

◆ 14 ఎకరాల్లో రూ.1.50 కోట్లతో నిర్మితం కానున్న అద్భుత వనం, మినీ ట్యాంక్ బండ్.

◆ నాటిన 20 వేల వివిధ రకాల మొక్కలను సంరక్షించాలి.

◆ పలు సూచనలు చేసిన మంత్రి పువ్వాడ.. పనుల వేగం పెంచాలని అధికారులకు ఆదేశం.

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి, పచ్చదనం పెంపొందించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఆదివారం రఘునాధపాలెం మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కనే 14 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ. 1.50 కోట్లతో అత్యద్భుతంగా నిర్మిస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం, ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పనుల పురోగతిని పరిశీలించారు.

also read;-చింతగుఫాలో పుడ్ పాయిజన్..28మంది కి అస్వస్థత

సుడా అధ్వర్యంలో ఎర్పాటు చేసిన ఆకాశం వైపు చూపిస్తున్న అరచేతి నుండి నీళ్లు జాలువారుతూ… పక్షి వాలిన ఆకారం వనంకు ఆకర్షణీయంగా నిలిచిందన్నారు.మొత్తం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 20వేల మొక్కలు నాటడం జరిగిందని అధికారులు వివరించారు. ఆయా మొక్కలకు ఎర్పాటు చేసిన డ్రిప్ ను పరిశీలించారు.ప్రజలకు ఉపయోగపడే జామ, దానిమ్మ, ఉసిరి, సీతాఫలం, నేరేడు, పారిజాతం, కరివేప, తదితర మొక్కలను నాటినందున ప్రతిమొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

also read;-చనిపోదాం అనుకున్నవాడు… సీఎం అయ్యాడు!

బండ్ చుట్టూ కొనసాగుతున్న బయోఫెన్సింగ్‌ పనులను పరిశీలించారు. దానిని అనుకుని పక్కనే మొక్కలు వేయాలన్నారు. మెయిన్‌గేట్‌, వాకింగ్‌ట్రాక్‌, ఆట స్థలం నిర్దేశిత స్థలంలో ఆట వస్తువులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేయాలని, కొనసాగుతున్న ఓపెన్ జిమ్ పనులను పరిశీలించారు.

బండ్ లోపలకు వెళ్లేందుకు ఎర్పాటు చేస్తున్న పైప్ లైన్ పనులు పరిశీలించారు.నిర్మాణ పనుల వేగం పెంచాలని, నిత్యం పర్యవేక్షిస్తూ నిర్దేశించిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు.కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జడ్పీ సీఈఓ అప్పారావు, DRDA PD విద్యాచందన, మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, పంచాయతి రాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఎంపీడీవో రామకృష్ణ, MRO నర్సింహరావు తదితరులు ఉన్నారు.