Telugu News

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికల నిర్వాహణకు సిద్దంగా ఉండండి

కలెక్టర్లు, జిల్లా అధికారులకు సూచించిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్

0

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికల నిర్వాహణకు సిద్దంగా ఉండండి

== కలెక్టర్లు, జిల్లా అధికారులకు సూచించిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జిల్లా కలెక్టర్లకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఖాలీగా ఉన్న స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేసారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ వార్డులు, పంచాయతీలకు, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీల్లో వార్డుల స్థానాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్నారు. 21 ఏప్రిల్ నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. ముందుగా పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి సిద్ధం చేసుకోవాలని, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టి-పోల్ లో నమోదు చేయాలన్నారు.

also read :-ఖమ్మంలో సందడి చేసిన సేవాదాస్ చిత్రయూనిట్

జనవరిలో రూపొందించిన ఓటరు జాబితా నుంచి ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా త్వరితగతిన రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తుది ఓటర్ల జాబితా పై సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. ముసాయిదా ఓటరు జాబితా, స్థానిక పంచాయతీలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆయన తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా పై ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటర్ల నమోదు దరఖాస్తులు పరిశీలించి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 21 నాటికి తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా తయారు చేసి నోటిఫై జిల్లా పంచాయతీ అధికారులను ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 23 నాటికి ఎంపిటిసి స్థానాలకు, జడ్పిటిసి స్థానాలకు సంబంధించి తుది ఓటరు జాబితా విడుదల చేసి ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.

also read :-నగరాభివృద్ధిలో భాగంగానే రోడ్లు ఎర్పాటు..

బ్యాలెట్ బాక్సులు, ఇంక్ బాటిళ్లు మొదలైన ఎన్నికల సామాగ్రి సంసిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో అవసరమైన ఎన్నికల సామాగ్రి అందుబాటులో లేని పక్షంలో పక్కన జిల్లా నుంచి తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో ఓటర్ల తుది జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో, పంచాయతీ ఆఫీసు లో, జిల్లా వెబ్సైట్లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. గ్రామ పంచాయతీ వార్డుల్లో ఓటర్ల జాబితా తయారు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఒక వార్డులో ఓటరు మరో వార్డులో ఉండకుండా జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణను చాలా పకడ్బందీగా తీసుకోవాలని అలసత్వం వహించడవద్దని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం ‘బ్యాలెట్ పేపర్ ముద్రించడానికి అనువైన ప్రింటింగ్ కేంద్రాలను గుర్తించాలని ఆయన సూచించారు.

also read:-కేంద్రానికి మరోసారి తెలంగాణ దెబ్బ రుచి చూపిద్దాం

ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ సిబ్బంది గుర్తించాలని ఆయన సూచించారు. ఎన్నికల బుక్లెట్ లను రిటర్నింగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను ముందస్తుగానే ఎంపిక చేసుకోవాలని, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టి-పోల్ లో నమోదు చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్,జిల్లా పంచాయితీ అధికారి వి.వి. అప్పారావు కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.