Telugu News

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రచ్చకెక్కిన రాజకీయ చదరంగం…!!

ఖమ్మం  -విజయం న్యూస్

0

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రచ్చకెక్కిన రాజకీయ చదరంగం…!!

(ఖమ్మం  -విజయం న్యూస్):-

బీజేపీ యువ నాయకుడుపై ఖమ్మం పట్టణ మూడవ పోలీస్ స్టేషన్ లో అనేక అక్రమ కేసులు…?, నిండు ప్రాణం బలి..!!
ఖమ్మం పట్టణ, ఉమ్మడి జిల్లాలో బిజెపి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సదరు యువనేత సామినేని సాయిచౌదరి(గనిభాయి)పై ఓ మంత్రి అఖండ బ్రహ్మాస్త్రం..!!

also read :-నేడు కందుకూరి వీరేశలింగం పంతులు  జయంతి సందర్బంగా

మూడో పట్టణ పోలీసులను అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు కేసులు బనాయించి పోలీసుల వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు… వేదింపులను తట్టుకోలేని సాయి చౌదరి ఖమ్మంమూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం… చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రుల్లో హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన… ఈ సంఘటనతో ఓమంత్రి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ప్రత్యేక దృష్టి పెట్టిన బిజెపి రాష్ట్ర కమిటీ, అధ్యక్షుడు బండి సంజయ్…….అనేక అక్రమ కేసులు పెట్టిన సదరు పోలీసు అధికారులపై చర్యలు ఉండేనా..!!