Telugu News

పల్లా యువసేన ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం .

మంత్రి అజయ్ పై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండన

0

పల్లా యువసేన ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం .

== మంత్రి అజయ్ పై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండన

(ఖమ్మం-విజయం న్యూస్);-  
ఖమ్మం జడ్పీసెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పల్లా కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పల్లా యువసేన ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ ను దహనం చేశారు. అభివృద్ధి ప్రదాత, జన సంద్రం అభిమానించే నాయకుడు, ఆప్యాయంగా పలకరించి చిరునవ్వుతో ఎంత కష్టనైనా దూరం చేసి మీకు నేనున్నాను అంటూ మనోధైర్యం నింపే నాయకుడు, ప్రజలే నా దేవుళ్లు వారే నాకు ధైర్యం అంటూ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన ఏకైక వన్ ఎన్ మ్యాన్ గా, అలుపెరగని సూర్యుడు గా, మంచి తనానికి మానవత్వానికి మరో పేరు అయినా రాష్ట్ర రవాణ శాఖ మంత్రి అజయ్ కుమార్ పై అన్ ఎడ్యుకేట్ లా నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడుతూ, అవాకులు చవాకులు పేలుతూన చింతపండు నవీన్ పై కేసు నమోదు చేయాలని, అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

also read :-గ్రానైట్ పరిశ్రమలను బతికించండి

ఖబద్దార్ చింతపండు నవీన్ అజయ్ అన్న జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ర్ట బంజారా సంఘం అధ్యక్షులు బానోతు కిషన్ నాయక్, తోట్టి కొమరయ్య, బీసీ సంఘం అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, యాకయ్య, డుంగ్రోత్ రాఘవేంద్ర, మణికంఠ నాయక్, విజయ దొరా, దార శ్రావణ్, జావిద్, చంద్ పాష, సాయి, మహాలక్ష్మీ, స్పందనా, జ్యోతి, శ్రీను, నాగయ్య, వెంకటేశ్వర్లు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.