Telugu News

ఖమ్మం జిల్లా పచ్చదనంతో నిండిపోయింది

సమీక్ష సమావేశంలో కొనియాడిన సీఎం కార్యాలయ ఓఎస్ డీ ప్రియాంక

0

ఖమ్మం జిల్లా పచ్చదనంతో నిండిపోయింది

== సమీక్ష సమావేశంలో కొనియాడిన సీఎం కార్యాలయ ఓఎస్ డీ ప్రియాంక

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-

ఖమ్మం జిల్లాలో ప్రకృతి పచ్చదంనతో కలకలలాడుతుందని ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయపు (హరితాహారం) ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీస్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరానికి చేరుకున్న ఆమె జిల్లాలో హరితాహారం లక్ష్యాలపై సంబంధిత శాఖల అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎం.పి.ఓలు, అటవీ, మున్సిపల్ అధికారులతో డి.పి.ఆర్.సి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ గత ఏడు విడతలుగా నిర్వహించుకున్న హరితహారం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. వచ్చే నెలలో మొదలయ్యో ఎనిమిదవ విడత హరితహారం లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

also read :-నూతన కలెక్టరేట్ భవనాన్న పరిశీలించిన ఓఎస్ డీ

అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యతగా తమ గ్రామంలో నాటిన మొక్కలను సజీవంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్క సజీవంగా ఉండాలన్నారు. హరితాహారంలో మొక్కలను నాటించడం, నాటిన మొక్కలను సజీవంగా ఉండేలా ప్రతిరోజు పంచాయితీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. పట్టణం, గ్రామాలల్లో ప్రతి ఇంటి ముందు, వాణిజ్య సముదాయాల ముందు మొక్కలు నాటాలని, రోడ్డుకిరువైపుల ఎవెన్యూ ప్లాంటేషన్ చేపాట్టాలన్నారు. పట్టణాలు, పల్లెలు పచ్చదనంతో కళకలలాడాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సంకల్పమని సాధన దిశలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ముందుతరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని ఓ.ఎస్.డి తెలిపారు. ఆయా గ్రామల అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ అటవీ శాఖ అధికారులపై ఉందని ప్రతి అధికారి బాధ్యతతో తమ విధులను నిర్వర్తించాలన్నారు.

also read :-కూసుమంచిలో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజువేడుకలు

పచ్చదనం పెంచడం ద్వారా పర్యావరణ సంరక్షణతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన కాలుష్యరహిత వాతావరణం లభిస్తుందని, పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలలో విరివిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఓ.ఎస్.డి అటవీ శాఖ అధికారులకు సూచించారు.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా జిల్లాలో పట్టణ, పల్లె, బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకొని నర్సరీల్లో అవసరమైన మొక్కలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టరు స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్న్ సురభి, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.అప్పారావు, ఎంపి.డి.ఓలు, ఎం.పి.ఓలు, అటవీ శాఖ అధికారులు, గ్రామ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

== సీఎం ఓఎస్ డీ ప్రియాంక ను స్వాగతం పలికిన కలెక్టర్, సీపీ
బుధవారం ఖమ్మం నగరానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కార్యాలయపు ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీసన్ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పోలీసు కమీషనర్ విష్ణు. యస్. వారియర్ స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా కలిసారు. నగరంలోని ఆఫీసర్స్ గెహౌజ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కార్యాలయపు ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీస్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమీషనర్ విష్ణు.యస్. వారియర్ స్వాగతం పలికారు. జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ,జిల్లా కలెక్టర్, పోలీసు కమీషనర్ లో పాల్గొన్నారు.