Telugu News

నన్ను క్షోభ పెట్టి ఏం సాధించారు:- ఏబీవీ

దిల్లీ విజయం న్యూస్

0

నన్ను క్షోభ పెట్టి ఏం సాధించారు:- ఏబీవీ

(దిల్లీ విజయం న్యూస్) :-

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.

మళ్లీ ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది.

ఈనేపథ్యంలో ఏబీవీ మీడియాతో మాట్లాడారు.

‘‘కొనుగోలు అనేదే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది? అసలు ఇదంతా జరిగేందుకు కారకులు ఎవరు..?

ఎవరి కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు..?

నన్ను, నా కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారు.

నా సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే తప్పా..?

నాపై వాదించే లాయర్లకు లక్షల ఫీజు చెల్లించారు.

తప్పుదారి పట్టించిన అధికారుల నుంచి రెవెన్యూ రికవరీ చేయాలి’’ అని ఏబీవీ వ్యాఖ్యానించారు.