Telugu News

ఖమ్మం అభివృద్ధి ప్రదాత మంత్రి పువ్వాడ అజయ్ పై ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కుట్ర..

సాయిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ది ప్రతిపక్ష పార్టీలే..

0

ఖమ్మం అభివృద్ధి ప్రదాత మంత్రి పువ్వాడ అజయ్ పై ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కుట్ర..

—-సాయిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ది ప్రతిపక్ష పార్టీలే..

—-కమ్మ కులానికి చెందిన ఏకైక మంత్రిని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు..

—-కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సాయిపై కేసులు నమోదు.

—-తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సంఘానికి కేసీఆర్ పెద్దపీట వేశారు..

—-కమ్మ సంఘం లో గెలిచిన ఎంపీ నామా నాగేశ్వరరావు ని పార్లమెంట్ నాయకుని చేసిన ఘనత కేసీఆర్ దే..

—-బిజెపి, కాంగ్రెస్ హత్య రాజకీయాలకు కుట్ర..

—–ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ ఏ పార్టీకి చెందినవాడో తెలియదు….

—-సాయి ని చనిపోయిన తర్వాత బీజేపీ కార్యకర్త అని ప్రచారం చేసుకుంటున్నారు…

—-మంత్రి అజయ్ పై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి.

—-కాంగ్రెస్, బిజెపి రాజకీయ కుట్ర, కుతంత్రాలను మధిర విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించిన కాకతీయ కమ్మ సంఘం.

(ఖమ్మం విజయం న్యూస్ ):-
?ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యను ప్రతిపక్షాలు పార్టీలు రాజకీయం చేస్తూ ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి పువ్వాడ అజయ్ పై అసత్య ఆరోపణలు రాజకీయ కుట్రలు చేస్తున్నారు అని మధిర కమ్మ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు .మధిర టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కాకతీయ కమ్మ సంఘం నాయకులు మాట్లాడుతూ సాయి గణేష్ చనిపోకముందు ఏ పార్టీకి చెందినవాడో తెలియదని కానీ చనిపోయాక బీజేపీ కార్యకర్త అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ హత్యారాజకీయలు చేస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికే అతనిపై పదహారు కేసులు నమోదయ్యాయని,కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అతనిపై కేసులు ఉన్నాయని అన్నారు.

also read :-ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు , వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి అజయ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని దీన్ని కమ్మ సంఘం పూర్తిగా ఖండిస్తుందని తెలిపారు.సాయి గణేష్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ పుతుంబాక కృష్ణ ప్రసాద్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ,కాకతీయ కమ్మ సంఘం అధ్యక్షులు కరివేద వెంకటేశ్వరావు, కార్యదర్శి బోయపాటి వెంకటేశ్వరావు(BVR),కార్యవర్గ సభ్యులు కరివేద సుధాకర్,బిక్కి ప్రసాద్,మధిర మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి నాగేశ్వరావు,రైతుబంధు మండల కన్వీనర్ చావా వేణు, శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు , కర్నాటి శ్రీనివాసరావు, నాయకులు నల్లమల శ్రీనివాసరావు,పిడికిటి సాంబశివరావు వాళ్ల నాగబాబు , కొంగ రవి తదితరులు పాల్గొన్నారు.