పినపాక లో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం..
పినపాక లో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
—తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం..
—సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్..
—పినపాక నియోజకవర్గ అభివృద్ధి
—రేగా కాంతారావు తోనే సాధ్యం..
—పినపాక లో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
(మణుగూరు రూరల్ విజయం న్యూస్):-
పినపాక టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లు. సత్తిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని. పినపాక నియోజకవర్గ కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి సంక్షేమ ప్రదాతగా నిలిచారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ. తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.
also read;-టేకులతండాలో భారీ అగ్ని ప్రమాదం
అలాగే పినపాక నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యం అన్నారు. ఏ ఎమ్మెల్యే చేయని విధంగా పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న ఘనత ఎమ్మెల్యే రేగా కాంతారావు కే దక్కుతుందన్నారు. రాబోయే ఎలక్షన్లలో రేగా కాంతారావు భారీ మెజార్టీతో గెలవడం తద్యం అని సత్తిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
also read;-ఆసియా ఖండంలోనే అద్భుత కట్టడం బుద్ధవనం
ఈ కార్యక్రమంలో తో గూడెం ఎంపీటీసీ చింతపంటి. సత్యం, పినపాక సర్పంచ్ గోగేల. నాగేశ్వరరావు, మండల పార్టీ నాయకులు దొడ్డ వెంకటేశ్వర్లు, ఎల్లు. చంద్రయ్య రెడ్డి, గునగంటి. సమ్మయ్య గౌడ్, కోడి రెక్కల. బాబు, కొంపెల్లి. నాగేశ్వరావు గౌడ్, అలవాల. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.