కాయకల్ప బృందంతో పి హెచ్ సి లను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
(రత్నశంకర్ – వాజేడు – విజయం న్యూస్ );-
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆలెం అప్పయ్య, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ క్రాంతి కుమార్ కాయకల్ప బృందం సభ్యులతో మండలంలోని వాజేడు, పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాల పరిశుభ్రత, ప్రసవాల సంఖ్య, బయో మెడికల్, ల్యాబ్, వేస్ట్ మేనేజ్మెంట్ పనితీరు ఆధారంగా ప్రభుత్వం కాయకల్ప అవార్డు ఇస్తున్న నేపథ్యంలో కాయకల్ప బృందం సభ్యులతో జిల్లా వైద్య అధికారులు పి.హెచ్.సి ల ను పరిశీలించారు.
also read :-పినపాక లో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఈ సందర్భంగా జిల్లా నాణ్యత పరిశీలన అధికారి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం వాజేడు, పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రోగ్రాం పై సమీక్ష నిర్వహించారు. మే 31 వ తారీకు వరకు ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వే పూర్తి చేయాలని, అవసరమైతే ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని గ్రామాల్లో పర్యటించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వైద్య బృందం లో జిల్లా ఆసుపత్రుల క్వాలిటీ అధికారి భాను ప్రకాష్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సరిత, ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్ మంకిడి వెంకటేశ్వరావు, వైద్యాధికారి శాంతి సౌర్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.