Telugu News

పేదల భూములను లాక్కుంటారా..?

భూమికి బదులు భూమినైనా ఇవ్వండి

0

పేదల భూములను లాక్కుంటారా..?

== భూమికి బదులు భూమినైనా ఇవ్వండి

== భూమిపైనే మా బతుకులు ఉన్నాయి

== విలేకర్ల సమావేశంలో జింకలతండా బాధిత రైతులు

(ఖమ్మం-విజయంన్యూస్);-
భూమికి బదులుగా మాకు భూమి ఇవ్వాలని రఘునాథపాలెం మండలం, జింకలతండాకు చెందిన బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రఘునాథపాలెం మండలం, జింకలతండాకు చెందిన పలువురు గిరిజన రైతులు పాల్గొని మాట్లాడారు. సర్వే నెంబర్ 30, 192లలోని పలువురు రైతులకు చెందిన 38 ఎకరాల అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం వారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి మీ భూములు ఇవ్వాలని అవి గార్మెంట్ భూములు అన్ని దౌర్జన్యంగా మా దగ్గర నుంచి లాక్కుంటున్నారని, మా భూములు మాకు ఇప్పించాలని కోరారు.

also read :-ఖమ్మం..అనుమానం తో భార్యపై కత్తితో దాడి..

ఆల్రెడీ ఈ భూమి విషం కోట్లు నడుస్తుందని, సుమారు నలబై, యాభై సంవత్సరాల నుండి ఆ భూములను సాగు చేసుకుంటున్నామని, ఒకవేళ ప్రభుత్వం వారు తప్పని పరిస్థితిగా తీసుకోవాల్సిన అవసరం వస్తే ఆ భూమికి బదులు మరోచోట భూమిని చూపించి తీసుకోవాలని ప్రభుత్వానికి మరియు సంబంధించిన అధికారులను కోరారు. దయచేసి మా జీవితాలను రోడ్డున పడవేయొద్దని వేడుకున్నారు. అనంతరం ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాత్ కు వినతిప్రతాన్ని అందించారు. జరిగిన నష్టాన్ని వివరించారు.

also  read :-రెచ్చిపోయిన మావోయిస్టులు

గతంలో ఈ విషయం పై మంత్రి గారిని కలిశామని అప్పుడు వారు ఎవరు భూములు పోతున్నాయో వారికి ప్రత్యామ్నాయం చూపించమని అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు . గతంలో ఉన్న రఘునాథపాలెం ఎమ్మార్వో తిరుమలరావుని కూడా కలిశామని సానుకూలంగా స్పందించి చేద్దాం చూద్దాం అని అన్నారు . ఆ తర్వాత కి వారు మరోచోటకి బదిలీ మీద వెళ్లిపోయారని తెలిపారు . ఇప్పుడు ఉన్న రఘునాథపాలెం తహసీల్దారు నరసింహారావు దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కావున వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగోత్ మంగ్యా, మాళోత్ లచ్చిరాం (లేటు), నాగేశ్వరరావు, బానోత్ కూనా, చల్లా వెంకటేశ్వర్లు, గమస శేషయ్య, బోడ శంకర్, బాణోత్ కృష్ణ, బోడా సోమ్లా, బోడ వీరన్న, బోడ నాగరాజు, చల్లా నర్సయ్య, తులసి, సాలిక్, సరోజా తదితరులు పాల్గొన్నారు