ఆర్టీసీ ఆస్పత్రికి మంత్రి అజయ్ వితరణ
★ పువ్వాడ ఫౌండేషన్ ద్వారా వితరణగా రెండు డయాలసిస్ యంత్రాలు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వ కృషి అత్యాధునిక వైద్య సౌకర్యాలు సిబ్బందికి సమకూరుతున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన వంతుగా పువ్వాడ ఫౌండేషన్ ద్వారా తోడ్పాటు అందించనున్నారు. ఆర్టీసీ సిబ్బంది చికిత్స అవసరాలకు రెండు డయాలసిస్ యంత్రాలను వితరణ చేయనున్నట్టు ప్రకటించారు. వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోసిస్) కేంద్రం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
also read :-8ఏళ్లలో తెలంగాణలో ఏం ఉద్దరించావో..?
★ సాయం చేయడంలో మంత్రి అజయ్ ముందే!!
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వితరణశీలత గురించి అందరికి తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. అలానే అడిగిన వారికి కాదనకుండా విరాళాలు, ఇతర పలు విధాలుగా ఆదుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా ఎంతో మందికి అండగా నిలిచారాయన. తాజాగా మంత్రి అజయ్ ఆర్టీసీ ఆస్పత్రికి రెండు డయాలసిస్ యంత్రాలను వితరణగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
also read :-హక్కు పరిరక్షణ సమితి ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మాదరి శ్రీకాంత్
ప్రజల వ్యక్తిగత, సామూహిక కష్టాలు, సమస్యలను ఓపిగ్గా వింటూ పరిష్కరిస్తూనే పార్టీ పరంగా కార్యకర్తలకు పెద్దన్నగా అండగా నిలుస్తున్న నేత మంత్రి అజయ్. నిరంతరం సమాజ, ప్రభుత్వ, ప్రజా, పార్టీ యంత్రాంగ సంబంధంగా అల్లుకున్న మానవీయ బంధం ఆయనది. ప్రతి ఒక్కరినీ ఇంటి మనిషిలా చేసుకునేంతటి సుగుణ సంస్కారం. విధి నిర్వహణలో, ప్రజాసేవలో, ఆపన్నులను ఆదుకోవటంలో విసుగూ, విరామం ఎరుగని నిరంతర ప్రజాసేవకుడుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరుగాంచారు.